సోమవారం వచ్చిందంటే.. ‘బిగ్ బాస్’ హౌస్‌లో నామినేషన్ల మంట ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. హౌస్ మేట్స్ వాదోపవాదనలతో దాదాపు చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న కంటెస్టెంట్లు కొట్టుకోవడం, తిట్టుకోవడం సాధారణమే అనుకుంటున్న టైమ్‌లో ఇప్పుడు.. 2.0 కింద వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కొత్త కంటెస్టెంట్లు వచ్చారు. దీంతో ఆట మరింత రంజుగా సాగుతోంది. ఇప్పటికే బయట బిగ్ బాస్ చూసి వచ్చిన కంటెస్టెంట్లు హౌస్‌లో.. పాత కంటెస్టెంట్లకు గట్టిపోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. 


భోలే vs అర్జున్


తాజా ప్రోమో ప్రకారం.. సింగర్ భోలే షావలికి నామినేషన్లు గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. ఆయన మాట తీరు నచ్చక కంటెస్టెంట్లు ఆయన్ని నామినేట్ చేస్తున్నారు. ‘‘అంతా ఒక లక్ష్యంతో బిగ్ బాస్‌కు వచ్చారు. మరి మీరు ఎందుకు వచ్చారు’’ అని అర్జున్ అంబాటి అని భోలే షావలిని ప్రశ్నించాడు. ‘‘ఉన్నా రెండు రోజులైనా మంచిగా ఉండాలని అనుకుంటున్నా. అది చాలు’’ అని అన్నాడు. ‘‘ఓన్లీ దానికే వచ్చాను అని అనుకుంటే.. మీరు హౌస్ నుంచి వెళ్లిపోవడానికి అంతకంటే పెద్ద కారణమైతే ఏదీ లేదు’’ అని భోలేను నామినేట్ చేశాడు అర్జున్. 


టేస్టీపై రైతు బిడ్డ ఫైర్


ఇక టేస్టీ తేజ, ఆట సందీప్‌లు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేసుకున్నారు. టేస్టీ తేజా నామినేట్ చేస్తున్న సమయంలో పల్లవి ప్రశాంత్.. ‘‘దా దా ఐ యామ్ వెయిటింగ్’’ అన్నాడు. ఆ తర్వాత సందీప్ నామినేషన్‌పై పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘‘నా నైజాన్ని నేను మార్చుకోను. బరాబర్ నేను తప్పు అని అంటే.. నేను ఇట్లే అంటా’’ అన్నాడు. దీంతో సందీప్ ‘‘నీ మాట బరాబర్‌కు వాల్యూ పోయింది’’ అని అన్నాడు. 


నేను జోకా?? - ప్రియాంక గరం గరం


ప్రియాంక జైన్ కూడా భోలే షావలినే టార్గెట్ చేసుకుంది. దీంతో భోలే.. ‘‘నిన్ను చూస్తే జోక్ అనిపిస్తోంది రా’’ అని అన్నాడు. దీంతో ప్రియాంక.. ‘‘నేను జోకా? నేను జోకా’’ అని ఫైర్ అయ్యింది. అర్జున్ స్పందిస్తూ.. ‘‘స్టేట్‌మెంట్ పాస్ చేసేప్పుడు.. వెనక ముందు ఆలోచించి మాట్లాడండి’’ అని తెలిపాడు. ‘‘రారా.. రారా..’’ అంటూ భోలే మరింత రెచ్చగొట్టాడు.. ‘‘వెయ్ రా వెయ్ రా అంటూ ఏమిటీ వెటకారంగా’’ అని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రియాంక.. అశ్వినీ శ్రీని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె ‘‘మీరంతా గ్రూప్‌గా ఉంటున్నారు’’ అని అనడంతో.. ప్రియాంక ‘‘గ్రూపు గ్రూపు అనోద్దు’’ అని ప్రియాంక అరిచింది. ఇలా నామినేషన్స్ వాడి వేడిగా సాగాయి. సందీప్, టేస్టీ తేజ‌తో ప్రశాంత్ గట్టిగానే పోట్టాడాడు. అయితే.. భోలే మాత్రం నామినేషన్స్ సీరియస్‌గా కాకుండా ఫన్నీగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘‘నాతోనే మాట్లాడిస్తారు. నేను పాట బిడ్డను’’ అని అనడాన్ని ప్రోమోలో చూపించారు. ఇంతకు ముందు ప్రోమోలో శివాజీ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు చూపించారు. అయితే, నామినేషన్స్ ఎపిసోడ్‌లో మాత్రం శివాజీ ఉన్నారు. ఆయన చేతికి కట్టు ఉంది. అయితే, ఆయన బయటకు వెళ్లింది.. నామినేషన్స్‌కు ముందా? ఆ తర్వాత అనేది తెలియాల్సి ఉంది. 


Also Read: శివాజీ తిరిగి వచ్చారా? బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమోలో ఇది గమనించారా?