కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ (Vijay) - లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో తెరకెక్కిన 'లియో'(Leo Movie) మూవీ రిలీజ్ కి ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో 'లియో' సృష్టిస్తున్న సంచలనాలు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీంతో 'లియో'పై అంచనాలు రోజురోజుకీ తారస్థాయికి చేరుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' రికార్డ్స్ (RRR Records)ని బ్రేక్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 'లియో' మరింత ముందుకు దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ దగ్గర 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన రెండవ ఇండియన్ మూవీగా 'లియో' నిలిచింది. లియో మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ దాటడం గమనార్హం.


గత ఏడాది విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మూవీ కూడా రిలీజ్ కి ముందు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. ఇప్పుడు విజయ్ 'లియో' ఆ ఘనత సాధించింది. ఈ రికార్డుతో ఓవర్సీస్ ప్రేక్షకులలో 'లియో'పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం అమెరికాలోనే కాదు... వరల్డ్ వైడ్ గా 'లియో' ఓపెనింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల క్రిందటే అమెరికాలో లియో టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మొదటి నుంచి టికెట్ సేల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కి ముందు అత్యధిక అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన తమిళ సినిమాగా 'లియో' రికార్డు క్రియేట్ చేసింది.


'లియో' అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ తొలి రోజే రూ. 110 కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలో ఓపెనింగ్స్ సుమారు 60 కోట్లకు పైగా... మిగతా ప్రపంచ దేశంలో 50 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన రజనీకాంత్ 2.0 రికార్డు బ్రేక్ చేసి అత్యధిక ఓపెనింగ్ సాధించిన తమిళ సినిమాగా నిలిచే దిశగా లియో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే లియో మూవీకి ఒక్క తమిళంలో తప్పితే మిగతా భాషల్లో పెద్దగా హైప్ ఏమీ కనబడట్లేదు. ఈ మూవీ ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు అనిరుద్ పాటలు కూడా ఆకట్టుకునేలా లేవు.


Also Read రోజాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా - మహేష్‌తో సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్


మన తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయడం లేదు. దానికి తోడు అదే సమయంలో 'టైగర్ నాగేశ్వరరావు', 'భగవంత్ కేసరి' లాంటి పెద్ద సినిమాలు ఉండడంతో తెలుగులో లియో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ ఓవర్సీస్ లో మాత్రం లియో క్రేజ్ ఓ రేంజ్ లో కనిపిస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మ్యాథ్యు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అక్టోబర్ 19న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.


Also Read : నితిన్ 'ఎక్స్ట్రా'లో రాజశేఖర్ రోల్ ఏంటో తెలుసా? - సినిమా స్టేటస్ ఏంటంటే?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial