నితిన్ (Nithin) హీరోగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఎక్స్ట్రా'. ఆర్డినరీ మ్యాన్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) నటిస్తున్నారని సోమవారం తెలిపారు. 


రాజశేఖర్ రోల్ ఏమిటంటే?
'ఎక్స్ట్రా' సినిమాలో రాజశేఖర్ ఐజీ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఆల్రెడీ షూట్ చేయడం స్టార్ట్ చేశారు. రెండు మూడు రోజులు రాజశేఖర్ మీద కీలక సన్నివేశాలు తీశారని, మరో నాలుగైదు రోజులు లేటెస్ట్ షెడ్యూల్లో ఆయన షూటింగ్ ఉంటుందని యూనిట్ వర్గాలు చెప్పాయి. 


పోలీస్ పాత్రలకు రాజశేఖర్ పెట్టింది పేరు. 'అంకుశం', 'ఆవేశం' నుంచి లేటెస్ట్ 'కల్కి' వరకు పలు సినిమాల్లో ఆయన పోలీస్ రోల్స్ చేశారు. అయితే... 'ఎక్స్ట్రా' సినిమాలో పాత్రకు, ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్లకు అసలు సంబంధం ఉండదట. పవర్ ఫుల్ పాత్రలో రాజశేఖర్ కొత్తగా కనిపిస్తారని వక్కంతం వంశీ చెబుతున్నారు. ఇంతకు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేయమని రాజశేఖర్ కు పలు అవకాశాలు వచ్చినా... ఆయన నో చెప్పారు. ఈ సినిమాకు ఓకే చెప్పారంటే సమ్ థింగ్ స్పెషల్ ఉండి ఉండాలి. 


హీరోగా నితిన్ 32వ చిత్రమిది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీ లీల (Sreeleela) కథానాయిక. నితిన్, శ్రీ లీల కలయికలో తొలి చిత్రమిది. వీళ్ళిద్దరిపై తెరకెక్కించిన 'డేంజర్ పిల్లా...' పాట ఆల్రెడీ వైరల్ అయ్యింది. 


Also Read పెద్ద మావయ్య శంకర్ దాదా... చిన్న మావయ్య గుడుంబా శంకర్... ఇప్పుడు మేనల్లుడు 'గాంజా శంకర్'






డిసెంబర్ 8న 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మ్యాన్'  
డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... 22న ప్రభాస్ 'సలార్' వస్తుండటంతో నితిన్ సినిమాను ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమాతో పాటు నాని 'హాయ్ నాన్న' కూడా డిసెంబర్ 7న విడుదల అవుతోంది. ఈ సినిమా గురించి వక్కంతం వంశీ మాట్లాడుతూ ''ఎక్స్‌ట్రా' క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో... 'కిక్' త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రేక్షకులకు రోల‌ర్ కోస్ట‌ర్‌ లాంటి అనుభూతి ఇస్తుంది. న‌వ్విస్తూనే ట్విస్టులతో స‌ర్‌ప్రైజ్‌ చేస్తుంది'' అని చెప్పారు. 


Also Read : బెంగళూరులో విజయ్ సినిమా టికెట్ రేటు యమ ఘాటు - 'లియో'కి 2500 ఏంటి స్వామి?



ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial