Mohan Babu: మోహన్ బాబు కొత్త సినిమా అప్‌డేట్‌ ఏంటంటే?

Lakshmi Manchu: మోహన్ బాబు కొత్త సినిమా అప్‌డేట్‌ ఏంటంటే? ఆ సినిమా గురించి లక్ష్మీ మంచి ఏమన్నారంటే?

Continues below advertisement

'పద్మశ్రీ' పురస్కార గ్రహీత - కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ఆయన కుమార్తె  - విలక్షణ నటి మంచు లక్ష్మీ ప్రసన్న తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ రూపొందించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. రెండు నెలలు ఏకధాటిగా షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Continues below advertisement

"నాన్నతో షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. వచ్చే రెండు నెలలు ఒత్తిడి తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఇంతకు మునుపెన్నడూ చూడని పాత్రల్లో మోహన్ బాబు, లక్ష్మి మంచు కనిపిస్తారని చిత్రబృందం అంటోంది.

Also Read: మంచు విష్ణు అస్సలు తగ్గడం లేదుగా! ఇన్‌స్టా వీడియో చూశారా?

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డైమండ్' రత్నబాబు కథ, మాటలు అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.

'సన్ ఆఫ్ ఇండియా' సినిమాతో ఈ ఏడాది మోహన్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే... వసూళ్ల పరంగా నిరాశ పరిచింది. సినిమా ప్లాప్ అయ్యింది.  నటుడిగా మోహన్ బాబు ప్రయోగం చేశారు. ఎక్కువ శాతం సన్నివేశాల్లో ఆయన ఒక్కరే కనిపించారు. ఈసారి అటువంటి ప్రయోగం చేయకుండా కొత్త తరహా కథ, కథనాలతో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. 

Also Read: లక్ష్మీ మంచుకూ తప్పని కాస్టింగ్ కౌచ్ - బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై మోహన్ బాబు కుమార్తె లేటెస్ట్ రియాక్షన్

Continues below advertisement