"అవును... నేనూ కాస్టింగ్ కౌచ్, సెక్సిజంను ఎదుర్కొన్నాను, ఎదుర్కొంటున్నాను" అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందన్నారామె. అయితే, సినిమా పరిశ్రమలో మాత్రమే కాదని... ఐటీ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ సెక్టార్, ఇతర ఇండస్ట్రీల్లోని చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారనే సంగతి తనకు తెలుసని లక్ష్మీ మంచు తెలిపారు. జీవితంలో వీటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలని ఆమె అభిప్రాయపడ్డారు.
నటిగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో తనకు కాస్టింగ్ కౌచ్ ఎదురు కాదని అనుకున్నట్టు లక్ష్మీ మంచు చెప్పుకొచ్చారు. బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ "నేను ఎవరి కుమార్తెను? పరిశ్రమలో పుట్టి పెరిగాను. కాబట్టి, నాకు కాస్టింగ్ కౌచ్, సెక్సిజం వంటివి ఎదురు కావని అనుకున్నాను. కానీ, వాళ్ళు దారుణంగా ఉంటారు. ఎవరికీ దయ అనేది ఉండదు" అని పేర్కొన్నారు.
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
బాడీ షేమింగ్, ట్రోల్స్ గురించి కూడా లక్ష్మీ మంచు స్పందించారు. తాను బొద్దుగా ఉన్నప్పుడు బొద్దుగా ఉన్నావని విమర్శించారని, ఇప్పుడు సన్నగా ఉన్నానని విమరిస్తున్నారని లక్ష్మీ మంచు వెల్లడించారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బాడీ షేమింగ్, ట్రోలింగ్ తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. నటీమణులు అందరూ ధైర్యంగా ఉండాలని ఆమె తెలిపారు. సినిమాలకు వస్తే... తండ్రి మోహన్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నట్టు ఇటీవల లక్ష్మీ మంచు వెల్లడించారు. అది కాకుండా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలోనూ, తమిళ సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు.
Also Read: నా ఫస్ట్ హీరోతో నటిస్తున్నా! అవార్డు అందుకున్నట్టు ఉందన్న లక్ష్మీ మంచు