సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎలా కలిసి వస్తుందో చెప్పడం కష్టం. కొంతమంది ఎంత కష్టపడినా పరిస్థితి అంతే అన్నట్టుగా ఉంటుంది. మరికొంత మంది ఊరికే కన్ను కొట్టినా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు. అలా కన్ను కొట్టి 'వింక్ గర్ల్'గా రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న మల్లూ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier). కానీ ఆ అదృష్టం ఆమె దగ్గర ఎక్కువ కాలం కొనసాగలేదు. మరి ఇప్పుడు ఈ హీరోయిన్ ఏం చేస్తుందో కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. 


వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ ? 


ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గీటిన వీడియో 2018లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్‌లో ఆమె వీడియో ఎంతగా వైరల్ అయ్యందంటే, ఓవర్ నైట్ ఈ హీరోయిన్ నేషనల్ క్రష్‌ గా మారింది. ప్రేక్షకులు ఆమె గురించి తెలుసుకోవడానికి ట్రై చేశారు. దాంతో ఆమె గూగుల్‌లో అత్యధికంగా సర్చ్ చేసిన అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. కానీ ఆ తరువాత వరుస డిజాస్టర్లతో బ్యాడ్ లక్ తలపై తాండవం చేసింది. ఇంకేముంది? ప్రేక్షకులు ఆమె ఎవరో కూడా మర్చిపోయారు. కట్ చేస్తే... 7 సంవత్సరాల తరువాత ఈ సౌత్ హీరోయిన్ బాలీవుడ్ అరంగేట్రం చేయడమే కాకుండా, ఇప్పటి వరకు హిందీలోనే భారీ బడ్జెట్ సినిమాలో భాగం కాబోతోంది.


మలయాళ చిత్రం 'ఒరు అదార్ లవ్'లో ప్రియా నటించినప్పుడు ఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఆ సినిమా 2019లో విడుదలైంది. అందులో ఆమె తన తోటి క్లాస్‌ మేట్‌కి కన్ను గీటుతున్న ఒక పాఠశాల విద్యార్థిని పాత్రను పోషించింది. ఈ చిత్రంలోని టీజర్ ను రిలీజ్ చేసినప్పుడు ఆమె క్లిప్ తెగ వైరల్ అయ్యింది. రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో లక్షలాది లైకులు, కామెంట్స్ తో నిండిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వీడియో దర్శనం ఇచ్చింది. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆమె రాత్రికి రాత్రే సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది. ఆమె పాట 'మాణిక్య మలరాయ పూవి' హిట్ సెన్సేషన్‌గా మారింది. పాఠశాల విద్యార్థిని పాత్రలో ప్రియా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. వాస్తవానికి ఆ సమయంలో ప్రియా అభిమానుల సంఖ్య సోషల్ మీడియాలో చాలామంది స్టార్ హీరోయిన్లను కూడా దాటి పోయింది. కానీ ఆ తరువాత కథ మారింది. 


Also Read: ఇండియాలో ఫస్ట్‌ 1000 కోట్ల సినిమాలో హీరోయిన్‌... 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు... ఆ హీరోలతో డేటింగ్ రూమర్లు!


ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ?


తన మొదటి మలయాళ చిత్రంతో పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ వయసు ఇప్పుడు 25 సంవత్సరాలు. ఆమె ఇప్పటికీ భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ను మెయింటైన్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాకు 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మలయాళ సినిమాలు '4 ఇయర్స్', 'లైవ్', 'కొల్లా', 'మందాకిని'తో పాటు హిందీలో 'శ్రీదేవి బంగ్లా', తెలుగులో 'చెక్', 'ఇష్క్', 'బ్రో' సినిమాలలో నటించింది. ఈ స్టార్ గర్ల్ 2024లో 'యారియాన్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కానీ ఇందులో ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ కాలేదు. దీంతో ప్రియా ఫోటోలు, వీడియోలతో కాలం గడిపింది. ఇక ఆమె కనుమరుగైనట్టే అనుకుంటున్న తరుణంలో ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ ధనుష్ దర్శకత్వం వహించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'లో తళుక్కున మెరిసింది. ఆ సినిమాలో ఆమెది చిన్న క్యారెక్టర్. కానీ, రిజిస్టర్ అయ్యే రోల్ చేసింది.


Priya Prakash Varrier Upcoming Movies: ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా 'రామాయణం'లో ఛాన్స్ దక్కించుకుని మరోసారి వార్తల్లో నిలిచింది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడుగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ 'రామాయణం'లో ప్రియా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. అలాగే రీసెంట్ గా ప్రియా ఓ కన్నడ సినిమాతో పలకరించింది. హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' సినిమాలు చేస్తున్నారు.


Also Read:చిరంజీవి, కమల్ హాసన్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి