Chiyaan Vikram's Veera Dheera Sooran Release Date: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వీరధీరసూరన్' (Veera Dheera Suran). చిన్నా మూవీ ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. చియాన్ 62గా వస్తోన్న ఈ సినిమా మార్చి 27న పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ వార్తతో విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెలుగులో ఈ సినిమాకు మెగాస్టార్ మూవీ కాళీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలో కాళీ టైటిల్‌తో రజినీకాంత్, చిరంజీవి ఓ మల్టీస్టారర్ మూవీ చేశారు. ఎస్వీఆర్ సినిమాస్ ద్వారా తెలుగులో కాళీ మూవీని రిలీజ్ చేస్తోంది.

ఈ మూవీలో కోలీవుడ్ హీరోయిన్ దుషారా విజయన్, ఎస్‌జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ఓ కిరాణా కొట్టు యజమానిగా, గ్యాంగ్ స్టార్‌గా డిఫరెంట్ షేడ్స్‌తో కనిపించబోతున్నారని తెలుస్తోంది. విక్రమ్, ఎస్‌జే సూర్య మధ్య వచ్చే మాస్ సీన్స్ పోటాపోటీగా ఉంటాయని సమాచారం. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, ఎప్పుడూ ప్రయోగాత్మకంగా డిఫరెంట్ కథాంశాలతో అలరిస్తుంటారు విక్రమ్. ప్రస్తుతం ఆయన గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్‌లో ధ్రువనక్షత్రం: యుద్ధకాండంలో నటిస్తున్నారు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ లీడ్ రోల్‌లో ఈ మూవీ నుంచి కొత్త అప్ డేట్ రావాల్సి ఉంది.

Also Read: 106 ఏళ్ల కిందట జరిగిన దారుణ హత్యాకాండ - వెబ్ సిరీస్‌గా జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది!