The Waking Of A Nation OTT Release On Sonyliv Platform: హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, పీరియాడికల్, హిస్టారికల్ డ్రామాల జానర్లలోనే మూవీలు, సిరీస్‌లపై ఎక్కువగా ఓటీటీలు దృష్టి సారిస్తున్నాయి. మూవీ లవర్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా థ్రిల్లింగ్ కంటెంట్, డ్రామా సిరీస్‌లతో అలరిస్తున్నాయి. తాజాగా, అలాంటి హిస్టారికల్ డ్రామా సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'సోనీ లివ్' (SonyLIV) అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' వెబ్ సిరీస్ తీసుకురాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు అదే జానర్‌లో 'ది వేకింగ్ ఆఫ్ ఏ నేషన్' (The Waking Of A Nation) సిరీస్‌ను మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సిరీస్ ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేసింది.


106 ఏళ్ల క్రితం జరిగిన దారుణ హత్యా కాండ.. స్వాతంత్ర్యోద్యమంలో కీలక ఘట్టంగా చెప్పుకొనే 'జలియన్ వాలాబాగ్' ఉదంతం వెనుక దాగి ఉన్న కుట్రపై ఈ సిరీస్ రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. 1919లో జరిగిన దారుణ హత్యాకాండ.. ముందస్తు పథకం ప్రకారమే జరిగిందంటూ కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించే లాయర్ కాంతిలాల్ సాహ్ని చుట్టూ సిరీస్ సాగుతుందని చెప్పారు. హంటర్ కమిషన్ చరిత్రను వక్రీకరిస్తుండడంతో ఈ కాంతిలాల్ నిజం కోసం పోరాడుతుంటారు. 






Also Read: డార్లింగ్ ప్రభాస్ గొప్ప మనసు - తండ్రిని కోల్పోయిన బాధలోనూ సాయం చేశారన్న 'బిల్లా' మూవీ రచయిత తోట ప్రసాద్


'చరిత్ర, సవాళ్లు చెప్పే సిరీస్'



జాతీయ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ  ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన డైరెక్టర్ రామ్ మధ్వాని (Ram Madhvani) ఈ సిరీస్ తెరకెక్కించగా ఈ ప్రాజెక్టుపై ఆయన స్పందించారు. 'నేను ఎంతగానో మెచ్చిన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఇదొక షో మాత్రమే కాదు. ఇండియా ఘన చరిత్ర. మనం ఎదుర్కొన్న సవాళ్లు చూపించేందుకు ఎంచుకున్న మార్గం. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ప్రేక్షకులకు చూపించడం నాకు ఎంతో ఇంపార్టెంట్. ఈ సిరీస్ తీసినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.' అని పేర్కొన్నారు. రామ్ మధ్వాని ఫిలింస్ బ్యానర్‌పై రామ్ మధ్వాని, అమిత మధ్వాని నిర్మించిన ఈ సిరీస్‌లో తారక్ రైనా, నికితా దత్తా, భావషీల్ సింగ్, అలెక్స్ రీస్, పాల్ మెక్ఇవాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ స్టోరీని శంతను శ్రీవాస్తవ, శత్రుజీత్ నాథ్, రామ్ మధ్వానీ రచించారు. ఇటీవల రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది.


Also Read: నేచురల్ స్టార్ నాని బర్త్ డే స్పెషల్ సర్ ప్రైజ్ - అవెయిటెడ్ మూవీ 'ది ప్యారడైజ్' గ్లింప్స్ రిలీజ్‌పై లేటెస్ట్ అప్ డేట్, రోల్ ఏంటో తెలియాలంటే..