మలయాళ ప్రముఖ నటి అపర్ణ నాయర్ (Aparna Nair) గత గురువారం అనుమానస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కేరళలోని తిరువనంతపురం కరమనలోని ఆగస్టు 31న తన ఇంట్లో అపర్ణ సూసైడ్ చేసుకుంది. భర్తతో గొడవల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అపర్ణకు ఆమె భర్తతో తరచూ గొడవలు జరిగేవి. మద్యానికి బానిసైన భర్త వల్లే అపర్ణ మరణించిందని ఆమె సోదరీ ఐశ్వర్య పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే అపర్ణ నాయర్ మృతికి ఆమె భర్త కారణమని తాజాగా కుటుంబ సభ్యులు ఆరోపించారు.


ఎఫ్ఐఆర్ ప్రకారం.. అపర్ణ భర్త మితిమీరిన మద్యపానం సేవించి ప్రతిరోజు ఆమెను వేధించేవాడని, ఆ వేదనను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని అపర్ణ సోదరి ఫిర్యాదు చేసింది. అపర్ణ చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన తల్లి బీనాతో వీడియో కాల్ చేసి భర్త సంజిత్ తో గొడవల గురించి మాట్లాడింది. భర్త తాగుడుతో విసిగిపోయానని, చనిపోవాలని అనుకుంటున్నట్లు ఫోన్లో తల్లితో మాట్లాడుతూ ఏడ్చింది. అనంతరం గురువారం రాత్రి 7 గంటలకు ఆమె ఇంట్లోని గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 7:30 గంటల ప్రాంతంలో అపర్ణని ఆసుపత్రికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.


దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించగా, అపర్ణ కుటుంబ సభ్యులు భర్త వల్లే ఆమె చనిపోయిందని ఆరోపించారు. అపర్ణ భర్త సంజిత్ ఆమెను తీవ్ర మానసిక హింసకు గురి చేశాడని, అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. అపర్ణ భర్త లోకల్ మీడియాతో తనపై అపర్ణ కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు అన్నిటినీ ఖండించారు. అంతే కాకుండా తమ మధ్య ఎలాంటి సమస్య లేదని, తాము సంతోషంగా జీవిస్తున్నామని చెప్పారు. సంజీత్ (Aparna Nair Husband)పై వచ్చిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.


అపర్ణ నాయర్ 2005లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సుమారు 50కి పైగా సినిమాలో నటించింది. 'మెగాతీర్థం', 'ముద్దుగౌవ్', 'అచ్చయాన్స్', 'కోదాటి సమక్షం బాలన్ వకీల్', 'కల్కి' వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కరమనలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్ గా పని చేస్తున్న అపర్ణ రెండు వారాల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇంతలో ఇలా ఊహించని రీతిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇక అపర్ణకు త్రయ,కృతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


అపర్ణకు సంజీవ్ తో రెండో పెళ్లి జరిగింది. ఆమె మొదటి భర్తతో ఓ కుమార్తె ఉండగా, రెండో భర్త సంజిత్ కు జన్మించిన మూడేళ్ల కుమార్తె ఉంది. కొన్నాళ్లు వీరి దాంపత్యం సవ్యంగానే సాగినా, సంజిత్ అతి తాగుడు వల్ల ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. అలా రోజు మద్యం సేవించి అపర్ణతో సంజిత్ గొడవపడేవాడు. ఆమెను మానసికంగా హింసించేవాడు. ఆ మానసిక క్షోభను తట్టుకోలేక అపర్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.


Also Read : బాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిన్లలో టీచర్లుగా పని చేసిన వాళ్ళు ఎవరో తెలుసా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial