సెప్టెంబర్ 5 'ఉపాధ్యాయ దినోత్సవం' అనే సంగతి అందరికీ తెలిసిందే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటాం. ఇక ఈరోజు(సెప్టెంబర్ 5) దేశవ్యాప్తంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అందరూ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే సినీ పరిశ్రమలో కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారనే విషయం మీకు తెలుసా?చాలామంది సినీ నటులు వాళ్లు సినిమాల్లోకి రాకముందు ఉపాధ్యాయులుగా పని చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ సినిమాల్లోకి రాకముందు ఉపాధ్యాయులుగా పని చేశారు. ఇంతకీ ఆ సినీ సెలబ్రిటీలు ఎవరు? అనేది ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం..


అక్షయ్ కుమార్ : అక్షయ్ కుమార్ కేవలం నటుడు గానే కాకుండా ఫిట్నెస్ ట్రైనర్ గా కూడా పనిచేశారు. సినిమాల్లోకి రాకముందు అతను మార్షల్ ఆర్ట్స్ నేర్పించేవాడు. ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత అక్షయ్ కుమార్ తండ్రి అతన్ని యుద్ధకళలు నేర్చుకోవడానికి బ్యాంకాక్, థాయిలాండ్ కి పంపారు. దాంతో అక్షయ్ కుమార్ సుమారు ఐదేళ్లపాటు అక్కడే ఉండి థాయ్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. అంతేకాదు తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఇండియాలోని అనేక నగరాల్లో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు సైతం చేశాడు. చివరగా ముంబైకి తిరిగి వచ్చి తాను నేర్చుకున్న యుద్ధ కలలను బోధించడం ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.


కియారా అద్వానీ : ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో కియారా అద్వానీ కూడా ఒకరు. 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో కీయారా ఓ స్కూల్ టీచర్ గా నటించడం మనం చూశాం. అయితే రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా కియారా అద్వానీ ప్లే స్కూల్ టీచర్ గా పని చేసింది. ముంబైలోని బర్డ్స్ ప్లే స్కూల్లో కియారా అద్వానీ టీచర్గా పనిచేసింది. ఆమె తల్లి కూడా అక్కడ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసేవారు. 


సానియా మల్హోత్రా : అమీర్ ఖాన్ 'దంగల్' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సానియా మల్హోత్ర. ఇక ఆమె అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే డాన్స్ వీడియోస్ లో ఆమె డాన్స్ స్కిల్స్ ని చూడొచ్చు. సినిమాల్లోకి రాకముందు సానియా మాల్హోత్రా డాన్స్ టీచర్ గా పని చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత సానియా ఢిల్లీలోని ఓ స్కూల్లో డాన్స్ టీచర్ ఉద్యోగంలో చేరింది. అంతేకాదు బ్యాలెట్ డాన్సర్ 2009లో డాన్స్ ఇండియా డాన్స్ లో కూడా పాల్గొంది. 2017 లో ఆమె నటించిన 'సీక్రెట్ సూపర్ స్టార్' మూవీలో 'సెక్సీ బాలియే' అనే పాటకు కొరియోగ్రాఫర్ కూడా పనిచేసింది సానియా మల్హోత్రా.


Also Read : ఎన్టీఆర్ 'బడిపంతులు' నుంచి చిరంజీవి 'ఠాగూర్‌' వరకూ - గురువుల గొప్పదనాన్ని చాటిచెప్పిన సినిమాలు


చంద్రచూర్ సింగ్ : బాలీవుడ్ లో ప్రముఖ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రచూర్ సింగ్ సినిమాల్లోకి రాకముందు న్యూఢిల్లీలోని వసంత్ వ్యాలీ అనే స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పని చేశారు. అంతేకాదు ఆయన క్లాసికల్ సింగర్ కూడా. డెహ్రాడూన్ లోని ది డూన్ అనే స్కూల్లో హిస్టరీ టీచర్ గా కూడా పనిచేశారట చంద్ర చూర్ సింగ్. డెహ్రాడూన్ లోనే ఆయన తన స్కూలింగ్ ని పూర్తి చేసినట్లు సమాచారం.


Also Read : శెట్టి పోలిశెట్టికి 'మెగా' అభినందన - హీరో, దర్శకుడిని ఇంటికి పిలిచి...


నందితా దాస్ : బాలీవుడ్ లో సుమారు 40 సినిమాలకు పైగా నటించి ఆ తర్వాత నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది నందితా దాస్. కెరీర్ స్టార్టింగ్ లో ఆమె థియేటర్ ఆర్టిస్ట్ గా కష్టపడుతున్న రోజుల్లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ వర్క్ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత రిషి వ్యాలీ అనే స్కూల్లో టీచర్గా పని చేసింది.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial