మాళవికా మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ. కథానాయికగా మాతృ భాషలో కంటే తమిళంలో ఆ అమ్మాయి ఎక్కువ పాపులర్. ఇప్పుడు కోలీవుడ్ భారీ సినిమాల్లో ఆవిడ నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... మరో తమిళ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. కార్తీ (Actor Karthi)కి జోడీగా నటించనుంది.






'సర్దార్ 2'లో మాళవికా మోహనన్
Malavika Mohanan In Sardar 2: కార్తీ కథానాయకుడిగా నటించిన 'సర్దార్' సినిమా  గుర్తు ఉంది కదా! వాటర్ బాటిల్స్ నేపథ్యంలో తెరకెక్కించారు. అది తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ (Sardar Movie Sequel) తెరకెక్కుతోంది. ఇటీవల 'సర్దార్ 2' రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో స్టార్ట్ చేశారు. 'సర్దార్'కు దర్శకత్వం వహించిన పీఎస్ మిత్రన్ ఇప్పుడీ 'సర్దార్ 2'కి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా మాళవికా మోహనన్ ఎంపిక అయినట్టు తాజాగా అనౌన్స్ చేశారు.


Also Read: ఎన్టీఆర్ - జాన్వీ జంట ముద్దొస్తుంది కదూ... 'దేవర'లో రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?






కార్తీ, మాళవికా మోహనన్ జంటగా నటించనున్న మొదటి సినిమా 'సర్దార్ 2'. దీని కంటే ముందు చియాన్ విక్రమ్ 'తంగలాన్'తో ఆగస్టు 15న ఆమె ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్'తో తెలుగు చిత్రసీమకు పరిచయం కానున్నారు. డబ్బింగ్ సినిమాలతో ఆవిడ తెలుగు ప్రేక్షకులకు తెలిసినా... 'రాజా సాబ్' ఆమెకు స్ట్రెయిట్ తెలుగు సినిమా.


Also Readబృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?



Sardar 2 Movie Cast And Crew: 'సర్దార్ 2' సినిమాలో ఎస్.జె. సూర్య పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. లేటెస్టుగా మాళవికా మోహనన్ సైతం నటిస్తున్నట్టు తెలిపారు. పిన్స్ పిక్చర్స్ సంస్థపై భారీ నిర్మాణ వ్యయంతో ఎస్. లక్ష్మణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న 'సర్దార్ 2' చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. జార్జ్ సి విలియమ్స్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి స్టంట్ డైరెక్టర్: దిలీప్ సుబ్బరాయన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నంబియార్, ఎడిటర్: విజయ్ వేలుకుట్టి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: AP పాల్ పాండి, సహ నిర్మాత: ఎ వెంకటేష్, దర్శకత్వం: పీఎస్ మిత్రన్.


Also Readతిరగబడర సామీ రివ్యూ: రాజ్ తరుణ్ ఇటువంటి సినిమాలు చేస్తే కెరీర్ తిరగబడుతుంది సామీ... డేంజర్ బెల్స్ మోగించిన డిజాస్టర్