Khel Khel Mein Trailer: బాలీవుడ్‌లో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు సైతం పెద్దగా ఆలోచించరు. అవి కామెడీ జోనర్‌లో తెరకెక్కిస్తే హిట్ గ్యారెంటీ అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అదే తరహాలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న బాలీవుడ్ కామెడీ మల్టీ స్టారర్ మూవీ ‘ఖేల్ ఖేల్ మే’. అక్షయ్ కుమార్ - వాణీ కపూర్, ఆమ్మీ వీర్క్ - తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, ఆదిత్య సీల్ - ప్రగ్యా జైస్వాల్.. ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు. ముదాస్సర్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.
గేమ్ నైట్..
‘ఖేల్ ఖేల్ మే’లో ఏడుగురు ఫ్రెండ్స్.. డిన్నర్ కోసం కలుస్తారు. అందులో ముగ్గురు కపుల్స్ కూడా ఉంటారు. ‘‘మనమందరం ఇక్కడ ఫ్రెండ్స్ లేదా కపుల్స్. కానీ ఎవరి ఫోన్‌లో ఏముంది అని ఎవరికీ తెలియదు’’ అంటూ వాణీ కపూర్ చెప్పే డైలాగ్‌తో ‘ఖేల్ ఖేల్ మే’ ట్రైలర్ మొదలవుతుంది. ‘‘అబ్బాయిలకు ఒక కోడ్ ఉంటుంది. వాళ్లు ఒకరు చేసే పనుల గురించి మరొకరికి అస్సలు చెప్పరు. కొంతమంది అయితే కనీసం ఫోన్ స్క్రీన్‌ను ఓపెన్‌గా కూడా పెట్టరు’’ అంటూ అబ్బాయిల మనస్తత్వాన్ని వివరిస్తుంది తాప్సీ. ‘‘ప్రతీ ఒక్కరం తమ ఫోన్స్‌ను అన్‌లాక్ చేసి టేబుల్‌పై పెడదాం. ఎవరికైనా ఏదైనా కాల్ లేదా మెసేజ్ వస్తే అందరి ముందు అటెండ్ చేయాలి. ఈ రాత్రి పూర్తయ్యే వరకు మన ఏడుగురి ఫోన్స్ పబ్లిక్ ప్రాపర్టీ’’ అంటూ గేమ్ రూల్స్ గురించి వివరిస్తుంది వాణీ కపూర్.
భార్యాభర్తల మధ్య గొడవలు..
గేమ్ గురించి అమ్మాయిలంతా ఎగ్జైటింగ్‌గా ఉంటారు. కానీ అబ్బాయిలకు మాత్రం దాని వల్ల వారి సీక్రెట్ బయటపడతాయని భయం మొదలవుతుంది. ముందుగా ప్రగ్యాకు హీరో టైగర్ ష్రాఫ్ నుంచి కాల్ వస్తుంది. ‘‘తనకు నీ పెళ్లాంతో పనేంటి’’ అంటూ ఆదిత్యకు కౌంటర్ ఇస్తాడు అక్షయ్. తర్వాత ఆదిత్యకు ఒక మెసేజ్ వస్తుంది. ‘‘నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు నా దగ్గర ఉంటే బాగుండేది’’ అని అందులో ఉంటుంది. అయితే ఆ నెంబర్ ఎవరిదో తనకు తెలియదని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు ఆదిత్య. దీంతో ఆ నెంబర్‌కు కాల్ చేసి చూడమని ఐడియా ఇస్తాడు అక్షయ్. ఆ తర్వాత తాప్సీ ఫ్రెండ్ ఫోన్ చేసి తన భర్తను బూతులు తిడుతుంది. అందరూ నవ్వుతారు.
రియాలిటీతో కామెడీ..
అందరూ గేమ్‌లో లీనమయిపోయిన తర్వాత మెల్లగా కపుల్స్ మధ్య గొడవలు మొదలవుతాయని ‘ఖేల్ ఖేల్ మే’ ట్రైలర్‌లో చూపించారు. అక్షయ్ కుమార్‌కు ఒక కాల్ గర్ల్ నుండి మెయిల్ రాగా.. ఆ అమ్మాయి తన పేషెంట్ అని కవర్ చేస్తాడు అక్షయ్. ‘‘ఫోన్‌లో మొహం పెట్టి జీవితం మొత్తం గడిపేస్తున్నాం’’ అంటూ కామెడీగానే రియాలిటీ గురించి చెప్తాడు ఫర్దీన్ ఖాన్. గేమ్ సీరియస్ అయినా కూడా అందరికీ ఇంకా అది ఆడాలని ఉందంటూ సమ్మతిస్తారు. తర్వాత ఏం జరిగిందో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే అని డైరెక్టర్ హింట్ ఇచ్చారు. మొత్తానికి ఆగస్ట్ 15న విడుదల కానున్న ‘ఖేల్ ఖేల్ మే’.. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండనుందని ట్రైలర్‌తోనే స్పష్టం చేశారు మేకర్స్.
Also Read: హైదరాబాద్ మెట్రోలో రవితేజ సర్ ప్రైజ్.. ఐడియా అదిరింది 'మిస్టర్ బచ్చన్'