Vijay Devarakonda: 'VD12' రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో చెప్పిన మూవీ టీం - షాకింగ్‌ లుక్‌లో విజయ్‌ దేవరకొండ, మరి ఇలా ఉన్నాడేంటి!

Vijay Devarakonda VD12: డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో నటిస్తున్న చిత్రం VD12. ఇంకా టైటిల్ ఖరారు చేయని మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం.

Continues below advertisement

Vijay Devarakonda and Gowtam Tinnanuri VD12 Release Date: రౌడీ హీరో విజయ్‌ దేవరకొడ, జెర్సీ ఫేం గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'VD12' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చారు. ఇప్పటి 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న  మూవీ టైటిల్‌ని ఇంకా ప్రకటించలేదు. కానీ రిలీజ్‌ డేట్‌ను మాత్రం ఫిక్స్‌ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. VD12 సినిమా విడుదల తేదీ ఖరారు చేస్తూ కొత్త పోస్టర్‌తో అధికారిక ప్రకటన ఇచ్చారు. 

Continues below advertisement

కాగా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవల శ్రీలంకలో షూటింగ్‌ జరుపుకుంది. అక్కడ సుందరమైన ప్రదేశాల్లో కీలకమైన సీన్స్‌తో పాటు హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. ఇప్పటి వరకు VD12 షూటింగ్‌ అరవై శాతం పూర్తయింది. దీంతో తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. 2025 మార్చి 28న ఈ సినిమాను వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన విజయ్‌ కొత్త లుక్‌ మూవీపై ఆసక్తి పెంచుతుంది. అంతేకాదు ఈ పోస్ట్‌కి 'విధి అతడి కోసం ఎదురుచూస్తోంది' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

ప్రస్తుతం విజయ్‌ కొత్త లుక్‌, ఈ క్యాప్షన్‌ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ కొత్త పోస్టర్‌లో విజయ్‌ షాకింగ్‌ లుక్‌లో దర్శనం ఇచచాడు. ఇదివరకు ఎన్నడు లేని విధంగా సరికొత్తగా మాస్‌ లుక్‌లో కనిపించాడు. షార్ట్‌ హెయిర్‌, ముఖంపై రక్తం కారుతున్న ఖాయాలతో ఇంటెన్స్‌గా కనిపించాడు. చూస్తుంటే విజయ్‌ ఖైదీ డ్రెస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వర్షం పడుతుంటే ముఖమంతా గాయాలు, రక్తంతో పైకి చూస్తు అరుస్తూ కనిపించాడు. ఇది వరకు ఎన్నడు విజయ్‌ని ఈ లుక్‌లో చూడలేదు. చూస్తుంటే ఈ లవర్‌ బాయ్‌ ఈసారి ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయడా? అనిపిస్తుంది.

ఇంతవరకు టైటిల్‌ ఖరారు చేయని ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేయడం గమనార్హం. ఈ అప్‌డేట్‌తో VD12 టైటిల్‌పై ఆసక్తి నెలకొంది. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. కోలీవుడ్‌ యండ్‌ అండ్‌ టాలంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్‌లు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. 

Also Read: రాజ్‌ తరుణ్‌ కేసు - లైవ్‌లో శేఖర్‌ భాషాను చెప్పుతో కొట్టిన లావణ్య, వీడియో వైరల్‌

Continues below advertisement