మాహిష్మతి... ఈ పదం వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'బాహుబలి'. అందులో మాహిష్మతి సామ్రాజ్యం. అయితే... ఇప్పుడు ఆ పేరు 'మాహిష్మతి'తో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. అందులో కొత్త సినిమా ప్రకటించారు.
ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు
Oka Parvathi Iddaru Devadasulu Movie: 'ఒక పార్వతి ఇద్దరు దేవదాసుల' టైటిల్‌తో మాహిష్మతి ప్రొడక్షన్స్ సినిమా అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి తోట రామకృష్ణ దర్శక నిర్మాత. ఇందులో సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలు. రాశి సింగ్ హీరోయిన్.
'ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు' దర్శక నిర్మాత తోట రామకృష్ణ (Thota Ramakrishna) మాట్లాడుతూ... ''మా సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కాలేజీ నేపథ్యంలో రూపొందుతున్న ముక్కోణపు ప్రేమ కథా చిత్రమిది. యువతను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాం''అని చెప్పారు.
'ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు' చిత్రానికి మోహిత్ రహమానియాక్ సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ పురస్కార విజేత చంద్రబోస్, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ, ఇంకా భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సిద్దార్థ్ మీనన్, దిలీప్, రాశి సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రఘు బాబు, కసిరెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీనివాసరాజు, కూర్పు: గన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శరత్ వర్మ, నిర్మాణ సంస్థ: మాహిష్మతి ప్రొడక్షన్స్, రచన - దర్శకత్వం - నిర్మాణం: తోట రామకృష్ణ.
Also Read: కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్‌పై రజనీ దండయాత్ర - ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?