Rajinikanth's Coolie first day worldwide collection: సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన స్టామినా ఏమిటో పాన్ ఇండియా స్థాయిలో చూపించారు. 'కూలీ'తో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ డే (గురువారం, ఆగస్టు 14న) భారీ వసూళ్లు సాధించింది. మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.
ఇండియాలో 65 కోట్లు ప్లస్...
ఓవర్సీస్ నుంచి 75 కోట్లు ప్లస్!
ఇండియన్ మార్కెట్టులో కంటే ఓవర్సీస్ మార్కెట్టులో 'కూలీ' దుమ్ము దులిపింది. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి 75 కోట్ల రూపాయలకు పైగా రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ మార్కెట్టు నుంచి 65 కోట్ల రూపాయలకు పైగా వచ్చాయని తెలిసింది. దాంతో మొత్తం మీద 140 కోట్ల రూపాయల మార్క్ దాటింది 'కూలీ'. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు హయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా 'కూలీ' రికార్డులు క్రియేట్ చేసిందని సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ 151 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని పేర్కొంది. దీంతో దళపతి విజయ్ 'లియో' పేరు మీద ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
మిక్స్డ్ టాక్... పూర్ రివ్యూస్...
ఇవాళ్టి నుంచి కలెక్షన్స్ సంగతేంటి?
'కూలీ'కి మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ లభించింది కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ మాత్రం రాలేదు. మూవీకి మిక్స్డ్ టాక్ లభించింది. రివ్యూస్ సైతం గొప్పగా రాలేదు. మరి, ఇవాళ్టి నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయో అని ట్రేడ్ వర్గాల్లో సందేహం నెలకొంది.
Also Read: 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?
'కూలీ'కి, ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలకు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అంశం. రిలీజ్ సెకండ్ డే ఆగస్టు 15 కావడం వల్ల జనాలకు హాలిడే ఉంటుంది. సో ఫ్యాన్స్ థియేటర్లకు వస్తారు. మౌత్ టాక్ ఎఫెక్ట్ పాజిటివ్ వేలో ఉంటే శని, ఆది వారాలలోనూ కలెక్షన్లకు ఢోకా ఉండదు. నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తే వీకెండ్ తర్వాత తగ్గుతుంది.
కింగ్ అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, కన్నడ హీరోయిన్ రచితా రామ్ వంటి బలమైన స్టార్ కాస్ట్ ఉండటం వల్ల అన్ని భాషల ప్రేక్షకులు సినిమాకు వస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది.
Also Read: తమిళ ప్రేక్షకుల ఆశలపై 'కూలీ' నీళ్ళు... ఇప్పట్లో 1000 కోట్ల గ్రాస్ కష్టమే బాస్!