Kollywood 1000 Crore Movies List: వెయ్యి కోట్ల గ్రాస్  కలెక్షన్ సాధించిన సినిమాల్లో తెలుగు నుంచి నాలుగు ఉన్నాయి. హిందీ నుంచి మూడు ఉన్నాయి. ఆఖరికి కన్నడ ఇండస్ట్రీ సైతం వెయ్యి కోట్ల క్లబ్బులో చేరింది. కానీ, తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా లేదు. ఆ లోటు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాతో తీరుతుందని ఆశిస్తే... ఆ ఆశల మీద 'కూలీ' నీళ్లు చల్లింది.

కోలీవుడ్ 1000 కోట్లు కొట్టేది ఎప్పుడు?'బాహుబలి' నుంచి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద టాలీవుడ్ జైత్రయాత్ర మొదలు అయ్యింది. అంతకు ముందు 'ఈగ'ను హిందీలో డబ్ చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన కంటే ముందు పాన్ ఇండియా మార్కెట్టు మీద తమ టాలెంట్ చూపించారు కోలీవుడ్ డైరెక్టర్లు శంకర్, మణిరత్నం. వాళ్ళు తీసిన సినిమాలు నార్త్ ఇండియన్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయ్. కానీ, వాళ్ళ ఖాతాలో వెయ్యి కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు.

Also Read: 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?

కమల్ హాసన్ 'విక్రమ్', రజనీకాంత్ 'జైలర్' వంటివి రీసెంట్ ఇయర్స్‌లో మంచి సక్సెస్ సాధించాయి. వాటి కలెక్షన్ వెయ్యి కోట్లు కాదు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'పోన్నియెన్ సెల్వన్' మీద కోలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఆ మూవీ 'బాహుబలి' తరహాలో విజయం సాధిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ కుదరలేదు. శంకర్ 'భారతీయుడు' సీక్వెల్, మణిరత్నం 'థగ్ లైఫ్' సైతం డిజాస్టర్లుగా నిలిచాయి. సూర్య 'కంగువా' నిర్మాత జ్ఞానవేల్ రాజా అయితే తమ సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని విడుదలకు ముందు చెప్పారు. ఆ మూవీ రిజల్ట్ తెలిసిందే. దాంతో యంగ్ డైరెక్టర్స్ వైపు చూశారు. కమల్ 'విక్రమ్'తో విజయం అందుకున్న లోకేష్, రజనీతో 'కూలీ' అనౌన్స్ చేయడం, అందులో భారీ తారాగణం ఉండటంతో ఆ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ డే రిజల్ట్ చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు.

Also Readకూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?

తమిళ్, తెలుగు ఓకే కానీ... మిగతా ఏరియాలు!?తమిళ, తెలుగు భాషల్లో 'కూలీ' ఓపెనింగ్ డే అక్యుపెన్సీ బావుంది. అయితే ఈ మూవీకి యునానిమస్ పాజిటివ్ రివ్యూలు రాలేదు. మిక్స్డ్ టాక్ ఉంది. ఇంకా చెప్పాలంటే బిలో ఏవరేజ్ టాక్ ఉంది. ఈ టాక్, థియేటర్లలో రెస్పాన్స్ చూస్తే వెయ్యి కోట్ల కలెక్షన్ అందుకోవడం కష్టం అని ఎవరికైనా యిట్టె అర్థం అవుతుంది. తమిళ మీడియా, క్రిటిక్స్ సైతం వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే సినిమా కోసం ఎదురు చూపులు తప్పవని ట్వీట్లు చేశారు. 'జైలర్ 2'తో రజనీకాంత్ ఆ ఫీట్ సాధిస్తారా? లేదంటే మరొక యంగ్ హీరో ఎవరైనా వెయ్యి కోట్లు కొల్లగొడతారా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Also Readఎవరీ వెజ్ ఫ్రైడ్ మోమో? చైల్డ్ ఆర్టిస్ట్ to బిగ్ బాస్ హౌస్... 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లోకి ఎంపికైన అమ్మాయి ఎవరో తెల్సా?