Rajamouli To Use New Technology For SSMB29 Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ 'SSMB29' కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా మహేష్ బాబు 50వ బర్త్ డే సందర్భంగా బిగ్ అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు జక్కన్న. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి సరికొత్త న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ మూవీ నుంచి మహేష్ బాబు బర్త్ డే రోజున ప్రీ లుక్ రిలీజ్ చేశారు రాజమౌళి. నవంబరులో బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందంటూ అప్డేట్ ఇచ్చారు. మహేష్‌తో తాను తీయబోయే సినిమా 'Globe trotter' అని తెలిపారు. దీంతో ఈ పదం ట్రెండింగ్‌లో ఉంది.
'Globe Trotter' కోసం సరికొత్తగా...
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలపై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజానికి కొత్త షెడ్యూల్‌ను తొలుత కెన్యాలో చిత్రీకరించాలని ప్లాన్ చేయగా... అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని టాంజానియాలో సెరంగటి అడవులకు లొకేషన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ ప్లాన్‌ను కూడా జక్కన్న పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ కోసం సరికొత్త బ్లూ స్క్రీన్ టెక్నాలజీ ఉపయోగించాలని దర్శక ధీరుడు ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ ఆఫ్రికా అడవులను AI ఆధారిత గ్రాఫిక్స్ సాయంతో సృష్టించి కీలక యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకూ ఇక్కడ షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత తాను ఎంచుకున్న టాంజానియా అడవుల లొకేషన్స్‌లో షూట్ చేసుకోవాలని టీం భావిస్తోందట. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ ఒడిశా, రామోజీ ఫిల్మ్ సిటీ సెట్స్‌లో పూర్తి చేశారు జక్కన్న.
Also Read: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పెషల్ ఆఫర్ - జస్ట్ 2 డేస్ ఫర్ 'సితారే జమీన్ పర్'
అసలేంటీ బ్లూ స్రీన్ టెక్నాలజీ?
బ్లూ స్క్రీన్ టెక్నాలజీ అంటే ఓ బ్లూ కలర్ స్క్రీన్ ముందు కీలక సీన్‌ను షూట్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సాయంతో ఆ బ్లూ స్క్రీన్‌ను సాఫ్ట్ వేర్ ద్వారా రిమూవ్ చేస్తారు. దాని ప్లేస్‌లో సిట్యుయేషన్‌కు తగిన విధంగా విజువల్స్ యాడ్ చేస్తారు. డీప్ ఫారెస్ట్, సముద్రం, వింత ప్రదేశాలు ఇలాంటివి అన్న మాట. ప్రస్తుతం మహేష్ మూవీలోనూ ఇలాంటి టెక్నాలజీనే ఉపయోగించనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి దీనిలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ట్రెండింగ్‌లో 'Globe Trotter'
మహేష్ బాబు ప్రీ లుక్ రివీల్ చేస్తూ రాజమౌళి యాడ్ చేసిన పదం 'Globe Trotter' ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వారి గురించి చెప్పే సందర్భంలో దీన్ని వాడతారు. అంటే ప్రపంచ పర్యాటకుడు అని అర్థం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా మూవీ ఉంటుందనే ప్రచారం మొదటి నుంచీ సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ వర్డ్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
'రామాయణం'లోని సంజీవని శోదన మూవీకి సెంటర్ పాయింట్ అనే ప్రచారం కూడా ఉంది. వీటన్నింటి ప్రకారం ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్ అని స్పష్టం అవుతోంది. మరి ఆ అద్భుతాన్ని చూడాలంటే 2027 వరకూ వెయిట్ చేయాల్సిందే.