Aamir Khan Independence Day Special Offer To Sitaare Zameen Par Movie: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ 'సితారే జమీన్ పర్'. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత నేరుగా యూట్యూబ్‍లోకే అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. అయితే, పే పర్ వ్యూ మోడల్‌లో రూ.100 చెల్లించి మూవీ చూడొచ్చు.

ఇండిపెండెన్స్ డే ఆఫర్

తాజాగా... ఈ మూవీపై గుడ్ న్యూస్ చెప్పింది మూవీ టీం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీని రూ.50కే చూడొచ్చని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే. ఈ నెల 15 నుంచి 17 వరకూ మూవీని రూ.50కు చూడొచ్చు. ఇదే విషయాన్ని చెబుతూ ఆమిర్ ఖాన్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామాలో ఆమిర్ ఖాన్‌తో పాటు జెనీలియా నటించారు. వీరితో పాటు గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆరోష్ దత్తా, ఆయుష్ భన్సాలీ, రిషి షహానీ, రిషబ్ జైన్, ఆశిష్ పెండ్సే, సిమ్రాన్ మంగేష్కర్, నమన్ మిశ్రా కీలక పాత్రలు పోషించారు.

Also Read: 'కూలీ' రివ్యూ: రజనీకాంత్ స్టైల్... నాగ్ స్వాగ్ సూపర్... మరి సినిమా? లోకేష్ కనగరాజ్ ఎలా తీశాడు?

స్టోరీ ఏంటంటే?

ఢిల్లీ బాస్కెట్ టీం అసిస్టెంట్ కోచ్‌గా పని చేస్తుంటాడు గుల్షన్ అరోరా (ఆమిర్ ఖాన్). ఓ విషయంలో హెడ్ కోచ్‌తో గొడవ జరిగి అతనిపై చేయి కూడా చేసుకుంటాడు. ఆ కోపంలో తాగి కారు నడిపి పోలీస్ వాహనాన్నే ఢీకొంటాడు. గుల్షన్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరచగా... అతనికి ఎలాంటి శిక్ష విధించకుండా సోషల్ సర్వీస్ చేయాలని ఆదేశిస్తుంది న్యాయస్థానం. మానసిక దివ్యాంగులకు 3 నెలల పాటు ఫుట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని సూచిస్తుంది.

కోర్టు ఆదేశాలతో ఇష్టం లేకున్నా 10 మంది మానసిక దివ్యాంగులకు బాస్కెట్ బాల్ కోచ్‌గా మారతాడు. మరి వాళ్లకు ట్రైనింగ్ ఇస్తున్న టైంలో ఎదురైన సవాళ్లేంటి? ఆ టైంలో అతను ఏం నేర్చుకున్నాడు? గతంలో అతని జీవితంలో జరిగిన ఘటనలేంటి? తన భార్య సునీత (జెనీలియా)కు దూరం కావడానికి రీజన్ ఏంటి? ఆమె భార్యకు మళ్లీ దగ్గరయ్యాడా? నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్‌లో తాను ట్రైన్ చేసిన టీం గెలిచిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.