పంద్రాగస్టుకు థియేటర్లలో రెండు భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ', హృతిక్ రోషన్ 'వార్ 2' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 'కూలీ'లో కింగ్ అక్కినేని నాగార్జున విలన్ రోల్ చేయడం, 'వార్ 2' మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ రెండు సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. మరి బిజినెస్ పరంగా ఎవరిది అప్పర్ హ్యాండ్? ఏ సినిమా థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? అనేది ఒక్కసారి చూస్తే...  

తెలుగులో ఎన్టీఆర్ సినిమా అప్పర్ హ్యాండ్!తెలుగులో రజనీకాంత్ అభిమానులు ఉన్నారు. అయితే ఆయన రీసెంట్ ఫిలిమ్స్ ఆశించిన సక్సెస్ కాలేదు. దాంతో బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు. నాగార్జున విలన్ రోల్ వల్ల ఆ సినిమాకు ఆ మాత్రం వచ్చిందని చెప్పవచ్చు. 'కూలీ' ముందు ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ పైచేయి సాధించింది.

'వార్ 2' తెలుగు రైట్స్ నాగవంశీ తీసుకున్న సంగతి తెలిసిందే. నైజాంలో 'దిల్' రాజు సినిమా ఇచ్చారు. థియేట్రికల్ బిజినెస్ వేల్యూ రూ. 36.50 కోట్ల కింద లెక్క కట్టారు. రాయలసీమ (సీడెడ్) రూ. 18 కోట్లు, ఆంధ్ర రూ. 36 కోట్లకు ఇచ్చారు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రైట్స్ రూ. 90.50 కోట్లు. 'కూలీ' విషయానికి వస్తే... రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 45 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. నైజాంలో రూ. 16 కోట్లు, రాయలసీమలో రూ. 10 కోట్లు, ఆంధ్రాలో రూ. 19 కోట్లకు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 'వార్ 2' రూ. 92 కోట్ల షేర్, 'కూలీ' రూ. 46 కోట్ల షేర్ రాబట్టాలి.

ఓవర్సీస్‌లో రజనీకాంత్ దూకుడు...ఏరియాలను బట్టి మారిన డామినేషన్!తెలుగు రాష్ట్రాలను దాటి బయట చూస్తే... ఏరియాలను బట్టి డామినేషన్ మారింది. ఓవర్సీస్ మార్కెట్టులో 'కూలీ' డామినేషన్ కొనసాగింది. రజనీకాంత్ సినిమాకు రూ. 85 కోట్లు వస్తే... 'వార్ 2' కేవలం రూ. 56 కోట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకుంది.

Also Read'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?

తమిళనాడు, కర్ణాటకలో అయితే రజనీకాంత్ సినిమా దగ్గరలోనూ 'వార్ 2' నిలవలేదు. 'కూలీ' తమిళ్ స్టేట్ రైట్స్ రూ. 120 కోట్లు. కర్ణాటక రైట్స్ రూ. 30 కోట్లు. 'వార్ 2' సినిమా కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి కేవలం రూ. 18.50 కోట్లు మాత్రమే. హిందీ మార్కెట్టులో మళ్ళీ 'వార్ 2' డామినేషన్ కనిపించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ తన సినిమాలను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. 'వార్ 2' హిందీ రైట్స్ రూ. 175 కోట్లు కింద లెక్క కట్టింది. కేరళ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 'కూలీ' రూ. 25 కోట్లు. అదీ సంగతి!

Also Read: ట్రాన్స్ మహిళ అంకితకు సొంత వర్గం నుంచి వెన్నుపోటు... అందువల్లే బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వెనక్కి!

'వార్ 2' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 340 కోట్లు కాగా... 'కూలీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 305 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే... రెండు సినిమాలూ మినిమమ్ రూ. 600 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ రాబట్టాలి. 'వార్ 2' అయితే మరో వంద కోట్లు ఎక్కువ కలెక్ట్ చేయాలి. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే 'కూలీ'కి ఎక్కువ బజ్ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ సినిమా దూకుడు చూపిస్తోంది.