Big Surprise In Rajinikanth Coolie Movie: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో 'కూలీ' మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా... రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. 'సినిమాటిక్ యూనివర్స్' అనే పదం పుట్టిందే లోకేశ్ నుంచి కాగా... 'కూలీ'కి 'లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌' (LCU)కు సంబంధం లేదని ఆయన ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

అయితే, ఫ్యాన్స్ మాత్రం LCUకు ఈ మూవీకి కచ్చితంగా సంబంధం ఉండే ఉంటుందంటూ సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు. విక్రమ్, మాస్టర్, ఖైదీ, లియో ఇలా 'LCU' నుంచి ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. 

బిగ్ సర్ ప్రైజ్ అదేనా?

'కూలీ' రిలీజ్‌కు ఒక్క రోజు ముందు లోకేశ్ కో రైటర్ చంద్రు అన్బళగన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కచ్చితంగా ఈ మూవీలో బిగ్ సర్ ప్రైజ్ ఉందని చెప్పారు. అయితే, అది 'LCU'తో లింకా లేక పూర్తిగా వేరే చిత్రమా అనేది థియేటర్స్ నుంచి ఆడియన్స్ బయటకు వచ్చిన వెంటనే తెలుస్తుందన్నారు. దీంతో ఆ సర్ ప్రైజ్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: భారం మొత్తం ఎన్టీఆర్ భుజాలపైనే... ప్రమోషన్స్ ఎక్కడ YRF? తెలుగులో ఎందుకిలా??

లోకేశ్ మూవీ అంటేనే...

నిజానికి లోకేశ్ మూవీ అంటేనే సర్ ప్రైజ్‌లు కామన్. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ క్లైమాక్స్ పవర్ ఫుల్ 'రోలెక్స్' రోల్‌లో సూర్యను తెరపైకి తెచ్చారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ 'కూలీ' మూవీలోనూ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది కూడా ఎవరూ ఊహించని సర్ ప్రైజే. అంతకంటే బిగ్ సర్ ప్రైజ్ ఏం ఉంటుందో అనే చర్చ సాగుతోంది.

రికార్డు ఓపెనర్

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్ కొనసాగుతుండగా ట్రెండ్ సృష్టిస్తోంది. కోలీవుడ్ నుంచి రికార్డు ఓపెనర్‌గా నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ డేనే రూ.100 కోట్ల గ్రాస్ ఓపెన్ చేయగా ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ఇది మరింత రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. మొత్తానికి రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్ల గ్రాస్ వస్తుందని భావిస్తున్నారు. 

టికెట్ రూ.4 వేలు!

ఏపీ, తెలంగాణతో పాటు ప్రధాన నగరాల్లో కూలీ థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఆన్ లైన్‌లో కొన్ని నిమిషాల్లోనే టికెట్స్ ఫుల్ అయిపోగా కొన్ని కొన్ని థియేటర్స్ వద్ద టికెట్ల కోసం చిన్నపాటి యుద్ధమే జరుగుతున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ థియేటర్ వద్ద మాత్రం బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతున్నారని... ఒక్కో టికెట్ ధర రూ.4 వేలన్నా ఎవరూ వెనుకాడడం లేదని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై రజినీకాంత్ మాస్ యాక్షన్, పవర్ ఫుల్ స్టైల్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.