తెలుగులో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) సంచలనం సృష్టించడం ఖాయంగా కనబడుతోంది. షో మొదలు అవ్వక ముందు సోషల్ మీడియాలో బిగ్ బాస్ వేడి పుట్టిస్తోంది. ఈసారి సామాన్యులకు సైతం అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి. ట్రాన్స్ మహిళలు సైతం షోలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేశారు. అందులో అంకిత నాయుడు ఒకరు. ఆవిడ ట్రాన్స్ కమ్యూనిటీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.   

ముంబైలో అటువంటి పనులు చేశా...వాళ్ళూ చేశారు... ఇప్పుడు వెనక్కి లాగారు!Trans Woman Ankitha Naidu On Bigg Boss 9 Telugu Agnipareeksha: ట్రాన్స్ మహిళ అంకితా నాయుడు 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' సెలక్షన్స్ వరకు వెళ్లినట్టు లీక్స్ వచ్చాయి. దాంతో ఏమైంది? అంటూ ఆవిడను సోషల్ మీడియాలో చాలా మంది అడగటం మొదలు పెట్టారు. దాంతో అందరికీ ఆవిడ క్లారిటీ ఇచ్చారు. 

''హాయ్ అండీ... అందరికీ నమస్కారం! ఒక ప్రముఖ షో (బిగ్ బాస్ అగ్నిపరీక్ష)కి వెళ్లిన మీరు ఎలిమినేట్ అయ్యారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో, నేను అందరికీ ఒక్క క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ఎలిమినేట్ కాలేదు. నా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగడం వల్ల వచ్చేయాల్సి వచ్చింది'' అని అంకితా నాయుడు చెప్పారు. 

ఆడదానికి ఆడది శత్రువు అయినట్టు, మగాడికి మగాడు శత్రువు అయినట్టు... మా కమ్యూనిటీలోనూ మాకు శత్రువులు ఉన్నారని అంకితా నాయుడు పేర్కొన్నారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''నేను ఎక్కడి వరకు వెళ్లాను. ఎన్నెన్ని పాస్ అయ్యి వెళ్ళాననేది నాకు తెలుసు. లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళినప్పుడు... ఎవరైతే నా వాళ్ళు అనుకున్నానో, వాళ్ళు నన్ను చెడుగా చిత్రీకరించడంతో వెనక్కి రావాల్సి వచ్చింది. నన్ను దెబ్బ తీయడానికి ప్రయత్నించిన వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ఆ షో గురించి ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. ఎందుకంటే అది జెన్యూన్. నా వీడియోలను ఎవరైతే పంపించారో... వాళ్ళూ ముంబైలో అలా చేసి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఎవరైతే మా కమ్యూనిటీ గురించి మాట్లాడతారో వాళ్ళూ అలా చేసిన వాళ్ళే. ఈ రోజు నేను ఒక షోకి ఫిక్స్ అవుతున్నాని తెలిసి కావాలని నన్ను వెనక్కి లాగి నా కడుపు మీద కొట్టారు. అటు వాళ్ళూ వెళ్లలేకపోయారు. ఇటు నేనూ వెళ్ళలేకపోయా. నేను అర్ధాంతరంగా వెనక్కి రావడం జరిగింది. ఆ షో టీంకి నా గురించి చెడుగా చెప్పడంతో పాటు నా వీడియోలు లీక్ చేశారు. ప్రతి ట్రాన్స్ మహిళ వేశ్య వృతి చేసి వస్తారు. నేనూ బ్రతకడానికి ఆ పని చేసుకుని, అవన్నీ దాటుకుని ముందుకు వచ్చా. ఈ రోజు నాకంటూ ప్లాట్ ఫార్మ్ కావాలని ముందుకు వెళ్లిన నన్ను నా కమ్యూనిటీ వెనక్కి లాగింది. నా విజయాన్ని వాళ్ళు తీసుకోలేకపోయారు'' అని పేర్కొన్నారు.

Also Read: బిగ్ బాస్ అగ్నిపరీక్ష' వీడియోలు లీక్... ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? బిందు మాధవి అస్సలు తగ్గట్లేదు

తన వీడియోలు లీక్ చేసిన వాళ్ళు సైతం ముంబైలో అటువంటి పనులు చేసి వచ్చిన వాళ్ళు అని అంకితా నాయుడు తెలిపారు. తనను 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' నుంచి రిజెక్ట్ చేయలేదని, తమ కమ్యూనిటీలో ఐక్యత లేకపోవడం వల్ల వెనక్కి రావాల్సి వచ్చిందని ఆవిడ ఆవిడ వ్యక్తం చేశారు. షోకి సెలక్ట్ అవ్వని కొందరు 'బిగ్ బాస్'కు వ్యతిరేకంగా వీడియోలు చేసే ఆలోచనలో ఉన్నారట. సెలక్షన్ ప్రాసెస్ కోసం ఆడిషన్ చేసినా సరే వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకుంటుంది స్టార్ మా. ఒకవేళ నెగెటివ్ వీడియోలు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటుంది. అంకితా నాయుడు షో మీద విమర్శలు చేయలేదు. ట్రాన్స్ కమ్యూనిటీ మీద విమర్శలు చేశారు.

Also Read'బిగ్ బాస్ 9' ఇంటిలోకి లక్స్ పాప... ఈసారి షోకి బోల్డ్ టచ్ ఇస్తున్నారా?