'లక్స్ పాప... లక్స్ పాప... లంచ్‌కి వస్తావా! లడ్డు తినిపిస్తావా!' సాంగ్ గుర్తు ఉందా? గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సూపర్ డూపర్ హిట్ 'నరసింహ నాయుడు' సినిమాలో హిట్ సాంగ్. ఆ పాటలో బాలకృష్ణతో స్టెప్పులు వేసిన అందాల భామ గుర్తు ఉందా? ఆ అమ్మాయి పేరు అప్పట్లో ఆశా షైనీ. ఇప్పుడు ఫ్లోరా షైనీ. ఆ అమ్మాయి ప్రస్తావన ఎందుకంటే... ఆవిడ 'బిగ్ బాస్ 9' ఇంటిలోకి వచ్చే అవకాశం ఉందట. 

'బిగ్ బాస్ 9' ఇంటిలోకి లక్స్ పాప?Flora Saini Telugu Films:'ప్రేమ కోసం'తో తెలుగు తెరపైకి ఆశా షైనీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత, 'నరసింహ నాయుడు'కు ముందు అరడజను సినిమాలు చేసింది. అయితే ఆమెకు 'లక్స్ పాప...' పాట పాపులారిటీ తెచ్చింది. విక్టరీ వెంకటేష్ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలోనూ ఒక క్యారెక్టర్ చేసింది ఆశా షైనీ. ఓ బర్త్ డే పార్టీకి వెళ్లి 'ఓ ప్రియతమా' అంటూ హీరో పాట పాడతాడు కదా! అది ఆశా షైనీ కోసమే. ఇప్పుడు ఆ అందాల భామ 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్. 

'బిగ్ బాస్ 9'కు బోల్డ్ టచ్ ఇస్తారా?తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన '143' వరకు ఆశా షైనీ కెరీర్ సాఫీగా సాగింది. ఆ తర్వాత ఆశించిన రీతిలో ఆవిడకు అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ వెళ్ళింది. అక్కడ కొన్ని అడల్ట్ కంటెంట్ సిరీస్, సినిమాల్లో నటించింది. తన పేరును ఆశా షైనీ నుంచి ఫ్లోరా షైనీగా మార్చుకుంది.

Also Read: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?

'బిగ్ బాస్ 9'కి ఫ్లోరా షైనీ అలియాస్ ఆశా షైనీ వచ్చే ఛాన్సులు ఉన్నాయని అంటే షోకి బోల్డ్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అని చాలా మందికి సందేహాలు కలుగుతున్నాయి. 'బిగ్ బాస్' అంటే టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఫ్యామిలీస్ కూడా చూస్తాయి. మరి అడల్ట్ కంటెంట్ వీడియోలు చేసిన లేడీని తీసుకు రావడం అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తూ టీఆర్పీ పెంచే ప్రయత్నమా? లేదంటే మరొక ఉద్దేశం ఉందా? అనేది చూడాలి.

'బిగ్ బాస్' లేటెస్ట్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu Host Name)కి సైతం కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ నుంచి అసలు షో మొదలు అవుతుంది. అంతకు ముందు కామన్ పీపుల్ సెలక్షన్ కోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' పేరుతో మరొక షో చేయనున్నారు. అది ఆగస్టు 22 లేదా 23న ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో 15 మంది పార్టిసిపేట్ చేయనున్నారు.

Also Readతెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!