స్టార్ మా ఛానల్ అనుమతి లేకుండా 'బిగ్ బాస్' ఇంటికి వెళ్లే అనుమతి ఎవరికీ ఉండదు. ఇంటి లోపలికి కాదు కదా... కనీసం గడప కూడా తొక్కలేరు. అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోస్‌లో 'బిగ్ బాస్' హౌస్ సెట్ ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే సవాలక్ష చెకింగ్స్ ఉంటాయి. అటువంటి కట్టుదిట్టమైన భద్రత నడుమ షూటింగ్ చేస్తారు. ఏకంగా అటువంటి 'బిగ్ బాస్'కి షాక్ ఇచ్చారు లీకువీరులు.

అగ్నిపరీక్ష సెలక్షన్ వీడియోలు లీక్!'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 కోసం కొత్త ప్లాన్ చేసింది స్టార్ మా. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కొందరిని ఇంటిలోకి పంపించడానికి ప్లాన్ చేసింది. అందుకోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' పేరుతో మరో స్పెషల్ షో చేస్తున్నారు. దానికి సెలక్షన్ ప్రాసెస్ మొదలైంది. ఆ షో వీడియోలు లీక్ అయ్యాయి. 

'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'కు సామాన్యులు చాలా మంది అప్లై చేసుకున్నారు. అందులో సుమారు 45 మందిని ఎంపిక చేశారు. మళ్ళీ వాళ్ళను వడపోసి చివరకు 15 మందిని ఎంపిక చేశారు. ఆ పదిహేను మందిని ఎంపిక చేయడం కోసం మాజీ 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు నవదీప్, అభిజీత్, బిందు మాధవిలను జడ్జీలుగా నియమించారు. ఇప్పుడు ఆ సెలక్షన్ ప్రాసెస్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Also Readఎవరీ వెజ్ ఫ్రైడ్ మోమో? చైల్డ్ ఆర్టిస్ట్ to బిగ్ బాస్ హౌస్... 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లోకి ఎంపికైన అమ్మాయి ఎవరో తెల్సా?

'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' షోలో అభిజీత్ నిప్పులు చెరిగాడని ఆల్రెడీ లీక్స్ వచ్చాయి. లీక్ అయిన వీడియోలు చూస్తే... జడ్జి సీట్లలో మధ్యలో బిందు మాధవి కూర్చోగా, ఆమెకు ఎడమ పక్కన నవదీప్, కుడిపక్కన అభిజీత్ ఉన్నారు. ఒక కంటెస్టెంట్ విషయంలో 'ఆ ఓవర్ యాక్షన్ ఏంటి? ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్' అని అరిచింది. నవదీప్ ఏమో 'ఏ పో' అని సీటు లోంచి లేచి వెళ్ళిపోయాడు. ఈ రేంజ్ లీక్స్ రావడం చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. లీక్ చేసిన వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: 'బిగ్ బాస్ 9' ఇంటిలోకి లక్స్ పాప... ఈసారి షోకి బోల్డ్ టచ్ ఇస్తున్నారా?