Coolie Movie Dominates War 2 In Advance Bookings: ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఒకటే మాట కూలీ, వార్ 2. గురువారం ఒకే రోజు బిగ్గెస్ట్ స్టార్స్ మూవీస్ థియేటర్లలోకి వస్తుండడంతో ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'వార్ 2', తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' దేనికదే ట్రెండ్ అవుతున్నాయి. 

మంగళవారం సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ కాగా నిమిషాల్లోనే టికెట్ బుకింగ్స్ యాప్స్‌లో రెండు మూవీస్ కూడా ట్రెండ్ సృష్టించాయి. అయితే, 'వార్ 2' కంటే తలైవా 'కూలీ' మూవీకి కాస్త ఎక్కువ హైప్ ఉందనే చెప్పాలి. బుకింగ్స్‌లో కూలీ ముందుంది. ప్రస్తుతం ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూస్తుంటే కోలీవుడ్ రికార్డ్ ఓపెనర్‌గా నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రికార్డ్ కలెక్షన్స్

రిలీజ్‌కు ముందే తలైవా 'కూలీ' 12.24 లక్షల టికెట్స్ అమ్ముడుపోగా రూ.27.01 కోట్లు వసూలు చేసింది. వివిధ భాషల్లో మొత్తం 10,322 షోలకు టికెట్స్ సేల్ అయినట్లు సాక్నిల్క్ నివేదికలో వెల్లడైంది. ఇక తమిళంలో రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ డే షోలకు 10 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోగా... రూ.22.81 కోట్లు వసూళ్లయ్యాయి. తెలుగు మార్కెట్లో 1.68 లక్షల టికెట్లతో రూ.3.38 కోట్లు... ఆ తర్వాత హిందీలో రూ.76.05 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

కూలీతో పోలిస్తే వార్ 2

కూలీతో మూవీతో పోలిస్తే వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో కాస్త వెనుకబడింది. తలైవా వార్ 2 ను డామినేట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ డే బుకింగ్స్ రూ.9.8 కోట్లకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 13,748 షోలకు 3.46 లక్షల టికెట్స్ అమ్ముడుపోయినట్లు సాక్నిల్క్ తెలిపింది.

Also Read: ఓటీటీలోకి స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సారే జహాసే అచ్ఛా' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

కూలీ వర్సెస్ వార్ 2

అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం కూలీ, వార్ 2 పోటాపోటీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓపెనింగ్స్ విషయంలో వార్ 2 కాస్త వెనుకబడినా సినిమా రిలీజ్ తర్వాత రిజల్ట్ వేరే ఉంటుందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 'వార్ 2' రైట్స్ తీసుకున్న సూర్యదేవర నాగవంశీ టికెట్ రేట్స్ పెంచేందుకు యత్నించారు. ఏపీలో టికెట్ రేట్స్ పెంచగా... తెలంగాణలో సాధారణ రేట్లకే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.175 నుంచి రూ.200కు టికెట్స్ సేల్స్ స్టార్ట్ చేశారు. ఇది కూడా 'వార్ 2' వెనుకబడడానికి కారణమని భావిస్తున్నారు.

'కూలీ'లో సూపర్ స్టార్ రజినీతో పాటు కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్టార్స్ భాగం కావడం, లోకేశ్ కనగరాజ్ బ్రాండ్, అనిరుధ్ బీజీఎం అన్నీ కలగలిపి టాప్ పొజిషన్‌లో పెట్టాయని విశ్లేషకులు అంచనా. 'వార్ 2'పైనా అంతే స్థాయి క్రేజ్ ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ఇదే ఫస్ట్ బాలీవుడ్ మూవీ. దీన్ని డబ్బింగ్ సినిమాగా కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమాలానే చూడాలంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ కామెంట్స్ సినిమాపై హైప్ అమాంతం పెంచేసింది. మొత్తానికి రిలీజ్ తర్వాత రిజల్ట్స్‌ను బట్టి కలెక్షన్స్ ఎలా ఉంటాయో తేలనుంది.