Saare Jahan Se Accha Web Series OTT Streaming: క్రైమ్, హారర్, స్పై థ్రిల్లర్స్ మూవీస్, వెబ్ సిరీస్‌లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా మరో లేటెస్ట్ స్పై థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. దేశ రక్షణలో 'స్పై'ల రోల్‌ను హైలైట్ చేస్తూ రూపొందించిన సిరీస్ 'సారే జహాసే అచ్ఛా'. 

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రతీక్ గాంధీ, సన్నీ హిందూజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' బుధవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ సిరీస్‌కు సుమిత్ పురోహిత్ దర్శకత్వం వహించగా... సుహైల్ నయ్యర్, కృతికా కమ్రా, తిలోత్తమ షోమ్, రజత్ కపూర్, అనుప్ సోనీ కీలక పాత్రలు పోషించారు. బాంబే ఫేబుల్స్ నిర్మించగా... గౌరవ్ శుక్లా రూపొందించారు.

స్టోరీ ఏంటంటే?

ఈ సిరీస్ 1970ల నేపథ్యంలో సాగుతుంది. దాయాది దేశం అణు ప్రణాళికలను ఆపడానికి చేసే ఆపరేషన్, ఇండో పాక్ యుద్ధం బ్యాక్ డ్రాప్‌‌గా ఉంటుంది. భారత నిఘా విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) గూఢచారులు... పాక్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)ల ప్రణాళికలను ఎలా పసిగట్టారో చూపించారు. స్పై ఆఫీసర్ విష్ణు శంకర్‌గా ప్రతీక్ గాంధీ కనిపించారు. ఓ గూఢచారికి ఇన్ఫర్మేషన్ ఎంత్ ఇంపార్టెంట్ అనేదే చెబుతూనే... మోర్స్ కోడ్‌లో సమాచారాన్ని సేకరిస్తుంటాడు. శత్రుదేశ స్థావరంలోకి ప్రవేశించి వారిని అణుశక్తిగా మారకుండా ఆపేందుకు ఏం చేశారనేదే ఈ సిరీస్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా 'నెట్ ఫ్లిక్స్' స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ బ్లాక్ బస్టరే... 'వార్ 2'కు దుబాయ్ నుంచి ఫుల్ పాజిటివ్ రివ్యూ