Soubin Shahir Role In Coolie: ఐదున్నర అడుగుల ఎత్తు..బట్టతల..అందగాడా అంటే ...కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పనికిరాడేమో అనేస్తారు. అయితేనేం.. టాలెంట్ ఉండాలే కానీ ఇవన్నీ లెక్కలోకిరావని ప్రూవ్ చేశాడు సౌబిన్ షాహిర్. సినిమా చిన్నదా పెద్దదా కాదు? తనకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారన్నది కూడా కాదు.. ఆ క్యారెక్టర్ కి తన నటనతో ప్రత్యేకత ఆపాదించడం సౌబీన్ సొంతం. అందుకే మలయాళంలో కెరీర్ స్టార్ట్ చేసిన సౌబీన్ తెలుగు, తమిళంలోనూ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కూలీ రిలీజ్ తర్వాత సౌబిన్ పేరు మరింత మారుమోగిపోతోంది.
కూలీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన స్పెషల్ సాంగ్ మోనిక తో బాగా వైరల్ అయ్యాడు. పూజాతో పోటీపడుతూ స్పెప్పులు అదరగొట్టేశాడు సౌబిన్. సాధారణంగా స్పెషల్ సాంగ్ అంటే హీరోయిన్ అందం, స్టెప్పుల గురించి మాట్లాడుతారు. కానీ ఈ సాంగ్ లో పూజా హెగ్డే కన్నా సౌబీన్ నే చూశారు ప్రేక్షకులు. ఇక మూవీరిలీజ్ తర్వాత అంతకుమించి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కూలీ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడూ సౌబిన్ నటన గురించే మాట్లాడుతున్నారంటే అంతలా కనెక్ట్ అయిపోయాడు. ఇప్పటివరకూ మలయాళంలో అందరకీ తెలిసిన సౌబిన్ కూలీ రిలీజ్ తర్వాత తెలుగులో బాగా ఫేమస్ అయిపోయాడు. సౌబిన్ బ్యాంగ్రౌండ్ ఏంటి?
ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు?
తక్కువ టైమ్ లో ఇంత క్రేజ్ ఎలా? మంజుమల్ బాయ్స్ సినిమా చూసి ఉంటారుగా... కేవలం 7 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 240 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నటించడమే కాదు నిర్మాత కూడా. సౌబిన్ కుటుంబానికి ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉంది. మలయాళ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు సౌబిన్ తండ్రి. చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉండేది. ఈ లోగా దొరికిన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. ఇలాంటి టైమ్ లో వచ్చిన ప్రేమమ్ మూవీ సూపర్ సక్సెస్ ఇచ్చింది. టీచర్ సాయిపల్లవికి లైన్ వేసే పీటీ మాస్టర్ క్యారెక్టర్లో నటించాడు. తెలుగులో సేమ్ క్యారెక్టర్ బ్రహ్మాజీ చేశాడు. ఆ తర్వాత 'కుంబలంగి నైట్' మూవీతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లొచ్చాయ్. సౌబిన్ కెరీర్లో మరో హిట్ 'రోమాం మంచముల బాయ్స్'.
ఓ వైపు వచ్చిన క్యారెక్టర్స్ లో నటిస్తూనే మరోవైపు దర్శకుడిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు. సౌబిన్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ 'పరవ'.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య సాగే స్టోరీ ఇది. కొన్ని థియేటర్స్ లో 100 రోజులు ప్రదర్శితమైంది. ఇక నిర్మాతగానూ తొలి అడుగులోనే హిట్ కొట్టాడు. స్వీయ నిర్మాణంలో తను నటించిన మంజుమల్ బాయ్స్ మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది. 'వాలెట్టి' అనే సినిమాలో కుక్కకి వాయిస్ అందించాడు..ఇంకా మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోల మూవీస్ లో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో నటించాడు. 'అంబలి' అనే సినిమాలో హీరోగాను ట్రై చేశాడు. ఓటీటీ ద్వారా ఇతర భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సౌబిన్.. రజనీకాంత్-లోకేష్ కనకరాజ్ కూలీలో ఛాన్స్ కొట్టేయడమే కాదు..సినిమా విజయంలో తానుసైతం అనిపించుకున్నాడు.