NTR And Hrithik Roshan's War 2 First Day Worldwide Collection: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2'. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ రియాక్షన్ వరకు ముందు నుంచి ఈ సినిమాకు సరైన బజ్ లేదు. ఓపెనింగ్ డే కలెక్షన్స్ రిపోర్ట్ సైతం ఆశించినట్టు రాలేదు. కట్ చేస్తే అంచనాలను మించి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టింది.
ఇండియా నుంచి 50 కోట్లు...ఓవర్సీస్ నుంచి 40 కోట్లకు పైగా!తెలుగు రాష్ట్రాల్లో 'వార్ 2' అడ్వాన్స్ బుకింగ్స్ లేటుగా స్టార్ట్ అయ్యాయి. ఆ ఇంపాక్ట్ ఎర్లీ ఎస్టిమేషన్స్ మీద కనిపించాయి. అయితే ఏపీ, తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాక అడ్వాన్స్ సేల్స్ పెరిగాయి. హిందీ మార్కెట్టులో 'వార్ 2' సినిమాకు 29 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వస్తే... తెలుగు మార్కెట్టులో రూ. 23.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో మిగతా ఏరియాల్లో 50 లక్షలు వచ్చే అవకాశం ఉందట. మొత్తంగా చూస్తే ఇండియా నుంచి 52.5 కోట్ల రూపాయలు వచ్చాయట. ఓవర్సీస్ నుంచి పెద్దగా కలెక్షన్లు రాలేదు. అక్కడ నుంచి రూ. 18 కోట్లు వచ్చినట్టు టాక్.
వంద కోట్ల మార్క్ దాటలేదుగా!ఇండియాలో 'వార్ 2' కలెక్షన్స్ 50 కోట్ల మార్క్ చేరుకుంటుందని ఎవరూ అనుకోలేదు. ఫస్ట్ డే ఇంచు మించు 40 కోట్లకు ఇటు ఇటుగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే అంచనాలను మించి సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఫస్ట్ డే ఈ సినిమా వంద కోట్ల మార్క్ దాటుతుందా? లేదా? అనే సందేహం నెలకొంది. ఇండియాలో నెట్ 51 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్లు 62 కోట్లు. మొత్తం మీద రూ. 80 కోట్ల దగ్గర సినిమా ఆగింది. వంద కోట్ల మార్క్ చేరుకోవడంలో ఫెయిల్ అయ్యింది.
Also Read: కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్‌పై రజనీ దండయాత్ర - ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
తెలుగులో కాపాడిన ఎన్టీఆర్ ఇమేజ్!తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాకు 23 కోట్లు వచ్చిన సందర్భాలు ఇప్పటి వరకు లేవని చెప్పాలి. కేవలం ఎన్టీఆర్ స్టార్ పవర్ ఈ వసూళ్లను రాబట్టింది. లేదంటే తెలుగు మార్కెట్టులో ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చేవి కావు. సినిమాకు మొదటి రోజు బాలీవుడ్ నుంచి రివ్యూస్ దారుణంగా వచ్చాయి. సినిమా అసలు బాలేదని అంటున్నారు. తెలుగులో మాత్రం పర్వాలేదన్నట్టు వచ్చాయి. దాంతో వీకెండ్ వరకు ఎలా ఉంటుందోనని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?