Mahesh Babu and SS Rajamouli Return From Dubai: ఇప్పుడు మన తెలుగు పాన్‌ ఇండియా సినిమాలన్ని ఒక ఎత్తయితే ఎస్‌ఎస్‌ రాజమౌళి-మహేష్‌ బాబు కాంబినేషన్‌లో రాబోయే SSMB29 ప్రాజెక్ట్‌ మరో ఎత్తు. ఇండియన్‌ సినిమాలోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ, పాన్‌ వరల్డ్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో వరల్డ్‌ స్టార్‌ నటులంతా కనిపిస్తారని టాక్‌. దీంతో ఈ సినిమా కోసం ప్రపంచం కూడా ఎదురుచూస్తుంది. అయితే ssmb29 అనౌన్స్‌ చేసే ఏడాదిన్నర కావోస్తుంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌నే జరుపుకుంటుంది ఈ సినిమా. ఎప్పుడు ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వస్తుంది, సెట్స్‌పైకి ఎప్పుడు వస్తుందా? అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎలాంటి చిన్న అప్‌డేట్‌ బయటకు వచ్చిన అది క్షణాల్లోనే ట్రెండ్‌ అవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అందరిని ఖుష్‌ చేసి ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.


ఇటీవల రాజమౌళి, మహేష్‌ బాబు ఈ మూవీ నిర్మాత కేఎల్‌ నారాయణలు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఈ మూవీ కోసం జక్కన్న మహేష్‌ దుబాయ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఎందుకు వెళ్లారు, లోకషన్స్‌ కోసమా? లేకా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగమా? అనేది క్లారిటీ లేదు. కానీ, వారితో పాటు నిర్మాత కేఎల్‌ నారాయణ ఉండటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ముగ్గురిని ఎయిర్‌పోర్టులో చూసి ఇక SSMB29 టైం వచ్చేసిందంటూ సంబరపడిపోతున్నారు. నిన్న రాత్రి మహేష్‌ బాబు, రాజమౌళి, కేఎల్‌ నారాయణలు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు లోపల నుంచి బయటకు వస్తూ కనిపించారు. ఇక ఈ ముగ్గురు కలిశారంటే మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి కావచ్చినట్టేనని, ఇక అనౌన్స్‌మెంట్స్‌, సెట్‌లో మహేష్‌ అడుగుపెట్టడమే మిగిలి ఉందని మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్‌ బాబు లుక్‌ మాత్రం అదిరిపోయింది. డైనమిక్‌ అండ్‌ డాషింగ్‌ లుక్‌లో మహేష్‌ బాబు కనిపించాడు. ఈ లుక్‌కి ప్రతి ఒక్కరు స్టన్‌ అవుతున్నారు. 






ఈ మూవీ జూన్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ నుంచి మొదలు కానుందనే ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి అప్పుడే షూటింగ్ అప్‌డేట్‌ ఇస్తారా? లేక ఇంకాస్తా ముందుకు జరుగుతుందా? అనేది తెలియదు. కానీ ఎస్‌ఎస్‌ఎంబీ 29 హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ని ఒకే దగ్గర చూసి ఇక అనౌన్స్‌మెంట్‌, షూటింగ్‌ అప్‌డేట్‌ వచ్చేస్తుందని ఫ్యాన్స్‌ అంచనాలు వేసుకుంటున్నార. ఇదిలా ఉంటే ఈ సినిమాకు 'మహారాజా' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. పాన్‌ వరల్డ్‌గా వస్తున్న ఈ సినిమా యాక్షన్‌, అడ్వెంచర్‌గా ఉండనుందని, ఇందులో మహేష్‌ జేమ్స్‌ బాండ్‌ తరహాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తాడంటున్నారు. దాదాపు ఈ సినిమా మొత్తం ఆఫ్రికల్ అడవుల్లో తెరకెక్కనుందట.


Also Read: సందీప్ రెడ్డి వంగా మాస్ - ఆ బాలీవుడ్ యాక్టర్‌కు ఇచ్చి పడేసిన దర్శకుడు