Article 370 OTT Release and Streaming Date: బాలీవుడ్ కాంట్రవర్సల్ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. బాలీవుడ్ నటి యామి గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్టికల్ 370’(Article 370). నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో వివాదాలు నడుమ రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఓ వర్గం ఆడియన్స్ నుంచి కూడా నెగిటివ్ రివ్యూస్ అందుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై వ్యతిరేకత నెలకొంది. రిలీజ్‌ను ఆపాలంటూ కొందరు నుంచి డిమాండ్స్ కూడా వచ్చాయి.
Article 370 OTT Release Date: ఒక వర్గాన్ని మాత్రమే అణచివేతకు గురయినట్లు చూపించారని, మొత్తం విలన్స్ అన్నట్లు చూపించారంటూ అరబ్ దేశాలు అయితే ఈ సినిమాపై ఏకంగా బ్యాన్ విధించాయి. అలా వివాదాలతో సంచలనంగా మారిన ఈ చిత్రం నెగిటివ్ రివ్యూ అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అంతగా వివాదస్పదమైన ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే విడుదలకు ముందు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చింది. రేపు ఏప్రిల్ 19 నుంచి 'ఆర్టికల్ 370' ఓటీటీ రిలీజ్ కాబోతుంది. అంటే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి.
ఆ సంఘటన ఆధారంగా..
2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన అనంతరం జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగిస్తూ భారత ప్రభుత్వం 'ఆర్టికల్ 370'ని రద్దు చేసింది. దీంతో దీనికి వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లో పెద్ద ఎత్తున్న నిరసనలు వెల్లువెత్తాయి.ఆ సమయంలో అక్కడ చోటుచేసుకున్న సంఘటన ఆధారంగా ‘ఆర్టికల్ 370’ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ జూనీ హక్సర్ పాత్రలో యామీ గౌతమ్ నటించింది. 2019 ఆగస్ట్ 5న జమ్మూ కశ్మీర్‌కు ఉన్న స్పెషల్ స్టేటస్‌ను తొలగించి, వాటిని కూడా టెర్రిటెరీలలో కలిపేసింది భారత ప్రభుత్వం. ఈ సినిమా మొత్తం ఆ సంఘటనపైనే ఆధారపడి తెరకెక్కించారు దర్శకుడు సుహాస్ జంభలే. మూవీని యామీ గౌతమ్ భర్త, దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మించాడు. ప్రియమణి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఇక ‘రామాయణ్’ ఫేమ్ అరుణ్ గోవిల్.. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కనిపించారు. మోదీగా అరుణ్ గోవిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే.. అది చూసి ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. కాగా జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రంలో అరుణ్ గోవిల్, వైభవ్ తత్వవాడి, కిరణ్ కర్మాకర్, స్కంద్ సంజీవ్ ఠాకూర్‌లు కీలక పాత్రల్లో నటించారు.