Nikhil Siddhartha Said His Son name and Life Changes After Father: యంగ్ నిఖిల్ సిద్దార్థ ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో అతడి భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇంతవరకు కొడుకును కానీ, బాబు పేరు కానీ పరిచయం చేయలేదు. అయితే ఈ రీసెంట్‌గా ఓ ఈవెంట్లో పాల్గొన్న నిఖిల్ బాబు పేరుతో పాటు తండ్రైన తర్వాత తనలో వచ్చిన మార్పు గురించి చెప్పుకొచ్చాడు. తన కుమారుడి కోసం కొన్ని అలవాట్లు మార్చుకున్నానని, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఖాళీ సమయాన్ని కుటుంబానికే కెటాయిస్తున్నానన్నాడు.
ఈ మేరకు నిఖిల్ మాట్లాడుతూ.. "బాబు పుట్టాక ఎక్కువ సమయంలో తనతోనే కేటాయిస్తున్నాను. మా అబ్బాయి పేరు ధీర సిద్ధార్త్. తండ్రిగా బాబు బాధ్యతను పంచుకుంటున్నాను. ఎక్కువ సమయం వాడితోనే గడపుతున్నాను. వాడు పుట్టాక నా అలవాట్లు కొన్నింటిని మార్చుకున్నాను. వారానికి కనీసం ఒక్కసారైనా పార్టీకి వెళ్లడం నాకు అలవాటు. కానీ ఇప్పుడు పూర్తిగా వెళ్లడం మానేశాను. తల్లిదండ్రులు అయ్యాక పిల్లల కోసం కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నిటికి దూరంగా ఉండాలి. ఇలా మార్పు వచ్చినా నేను సంతోషంగానే ఉన్నాను. భర్తగా, తండ్రిగా ఇలా అన్ని రకాలుగా ఆనందంగానే ఉన్నాను. నా జీవితం ఇలా ఉంటుందని కొన్నెళ్ల క్రితమే ఎవరైనా చెప్పిఉంటే ఇన్ని సంవత్సరాలు ఇంత ఒత్తిడికి గురయ్యేవాడినే కాదు" అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా చివరిగా నిఖిల్ స్పై మూవీతో పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం బాగానే చేసింది. ఇప్పుడు నిఖిల్ 'స్వయంభు'లో మూవీతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియాగా వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుంది. భరత్ క్రష్ణమాచారి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. నభానటేష్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం అతడు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీల్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. కాగా నిఖిల్ నటించిన తొలి చిత్రం హ్యాపీ డేస్ ఇప్పుడు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రేపు ఏప్రిల్ 19న ఈ మూవీ మరోసారి థియేటర్లో సందడి చేయబోతుంది.
Also Read: 'కన్నప్ప' నుంచి నయనతార అవుట్? - ఆ స్టార్ హీరోయిన్‌ని లైన్లో పెట్టిన విష్ణు!