Sandeep Reddy Vanga Vs Adil Hussain: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యాటిట్యూడ్ 'తగ్గేది లే' అన్నట్టు ఉంటుంది. 'కబీర్ సింగ్' కావచ్చు, 'యానిమల్' కావచ్చు... తాను దర్శకత్వం వహించిన సినిమాలపై ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే ఆయన అస్సలు ఊరుకోరు. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తారు. లేటెస్టుగా బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ కామెంట్స్ (Adil Hussain Comments On Kabir Singh)కు సందీప్ రెడ్డి వంగా ఇచ్చి పడేశారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... 


'కబీర్ సింగ్'లో నటించినందుకు చింతిస్తున్నా! - ఆదిల్ హుస్సేన్ 
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'అర్జున్ రెడ్డి' తెలుగులో కల్ట్ స్టేటస్ సాధించింది. భారీ విజయం సాధించడమే కాదు... విజయ్ దేవరకొండను స్టార్ చేసింది. ఆ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు సందీప్ రెడ్డి వంగా. అందులో డీన్ పాత్రలో ఆదిల్ హుస్సేన్ నటించారు.


Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!


ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను 'కబీర్ సింగ్'లో నటించినందుకు చింతిస్తున్నట్లు ఆదిల్ హుస్సేన్ పేర్కొన్నారు. స్క్రిప్ట్ పూర్తిగా చదవకుండా తాను ఓకే చేసిన సినిమా అదొక్కటేనని ఆయన తెలిపారు. ఆ సినిమా చేసిన తర్వాత తాను ఇబ్బందికరంగా ఫీలైనట్లు చెప్పుకొచ్చారు. థియేటర్ నుంచి మధ్యలో వచ్చేసినట్టు తెలిపారు. డబ్బు కోసం ఒక్క రోజు సీన్ చేసి వచ్చానని, తాను ఆ సినిమాలో ఎందుకు నటించానని తర్వాత బాధ పడినట్లు తెలిపారు. ఆ ఇంటర్వ్యూ క్లిప్ సందీప్ రెడ్డి వంగా దృష్టికి వెళ్ళింది. దాంతో ఆయన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ / ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


మీ ఫేస్ ఏఐతో రీప్లేస్ చేస్తా! - సందీప్ రెడ్డి వంగా
''మీరు గొప్పవని నమ్మి నటించిన 30 సినిమాలతో రాని గుర్తింపు... 'ఎందుకు నటించానా?' అని చింతిస్తున్న ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా తీసుకు వచ్చింది. నటన మీద మీకు అభిరుచి కంటే దురాశ ఎక్కువ ఉంది. మిమ్మల్ని నా సినిమాలోకి ఎందుకు తీసుకున్నానని నేను ఇప్పుడు చింతిస్తున్నా. ఇకపై మీరు ఇబ్బంది పడకుండా, సిగ్గు పడకుండా ఉండేలా చేస్తా. 'కబీర్ సింగ్' సినిమాలో మీ ముఖం బదులు ఏఐ స్థానంతో మరొకరి ముఖం రీప్లేస్ చేస్తా'' అని సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు.




Also Readఅల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!



'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్', ఆ తర్వాత రణబీర్ కపూర్ హీరోగా 'యానిమల్' తీశారు. ఆ రెండూ బాక్సాఫీస్ బరిలో భారీ విజయాలు సాధించాయి. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' తీసేందుకు రెడీ అవుతున్నారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మరో సినిమా చేసేందుకు అంగీకరించారు.


Also Readఆది సాయికుమార్ కొత్త సినిమాకు 'దిల్' రాజు క్లాప్ - బృందావనం నుంచి వచ్చిన కృష్ణుడిగా...