Aadi Saikumar: ఆది సాయికుమార్ కొత్త సినిమాకు 'దిల్' రాజు క్లాప్ - బృందావనం నుంచి వచ్చిన కృష్ణుడిగా...

Krishna From Brindavanam Movie: ఆది సాయికుమార్ హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' సినిమా నేడు మొదలైంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో 'దిల్' రాజు, అనిల్ రావిపూడి సందడి చేశారు.

Continues below advertisement

ఆది సాయికుమార్ (Aadi Saikumar) కథానాయకుడిగా గురువారం కొత్త సినిమా 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' (Krishna From Brindavanam) పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రానికి వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. ఇంతకు ముందు వీళ్ల కలయికలో 'చుట్టాలబ్బాయి' వచ్చింది. ఇప్పుడీ కొత్త చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ పతాకంపై తూము నరసింహ, జామి శ్రీనివాస రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

Continues below advertisement

'కృష్ణ ఫ్రమ్ బృందావనం' పూజా కార్యక్రమాలు కాకతీయ హిల్స్‌ వెంకటేశ్వరుడి సన్నిధిలో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇవ్వగా... అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించడంతో పాటు కెమెరా స్విచ్ఛాన్ చేశారు సాయి కుమార్. 

కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది: ఆది సాయికుమార్
ఆది సాయికుమార్ మాట్లాడుతూ... ''మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన 'దిల్' రాజు, అనిల్ రావిపూడి గార్లకు థాంక్స్. 'చుట్టాలబ్బాయి' తర్వాత నేను, వీరభద్రమ్ గారు సినిమా చేయాలనుకున్నాం. ఇప్పటికి మంచి కథ కుదిరింది. కుటుంబం అంతా కలిసి చూసేలా... అందరూ నవ్వుకునేలా ఉంటుందీ సినిమా. జూన్ నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. 'క్రేజీ ఫెల్లో' తర్వాత నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటిస్తున్న చిత్రమిది. 'ప్రేమ కావాలి', 'లవ్ లీ', 'సుకుమారుడు', 'ప్యార్ మే పడిపోయానే'.... నాకు అనూప్ రూబెన్స్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి పని చేస్తున్నా. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడం విశేషం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు.

Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!


హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యం ఉంటుంది: వీరభద్రమ్ చౌదరి
'చుట్టాలబ్బాయి' తర్వాత ఆది, తాను సినిమా చేయాలని ట్రై చేశామని, ఇన్నాళ్లకు మంచి కథ కుదిరిందని దర్శకుడు వీరభద్రమ్ చౌదరి తెలిపారు. 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' ప్రారంభోత్సవానికి వచ్చిన 'దిల్' రాజు, అనిల్ రావిపూడికి థాంక్స్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నిర్మాతలు తూము నరసింహ, జామి శ్రీనివాసరావు ఖర్చుకు వెనుకాడకుండా, రాజీ  పడకుండా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ మాటలు, శ్యాం సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్‌ అవుతాయి'' అని అన్నారు.

Also Readఅల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!


''వీరభద్రమ్ గారికి వినోదమంటే చాలా ఇష్టం. మేం చేసిన 'చుట్టలాబాయి' విజయం సాధించింది. కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఆయన తీస్తారు. 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' కూడా కుటుంబంతో చూడొచ్చు. మంచి కథతో నిర్మాతలు చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అని సాయి కుమార్ అన్నారు. ఆదితో మళ్లీ నటిస్తుండటం సంతోషంగా ఉందని దిగంగనా చెప్పారు.

Krishna From Brindavanam Movie Cast And Crew: ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో 'డీజే టిల్లు' & 'టిల్లు స్క్వేర్' ఫేమ్ మురళీధర్ గౌడ్, '30 ఇయర్స్' పృథ్వీ, రఘుబాబు, 'ముక్కు' అవినాష్, 'రచ్చ' రవి, 'బిగ్ బాస్' ఫేమ్ అశ్వినీ, శ్రీ దేవి, అలేఖ్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, 'మాస్టర్' రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ ఇతర కీలక తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: చోటా కె ప్రసాద్, మాటలు: రాము మన్నార్, ఛాయాగ్రహణం: శ్యామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాణ సంస్థ: లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్, నిర్మాతలు: తూము నరసింహ - జామి శ్రీనివాస్, కథ - కథనం - దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి.

Continues below advertisement
Sponsored Links by Taboola