నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మా నాన్న సూపర్ హీరో' (Maa Nanna Superhero Movie). తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. విజయ దశమి సందర్భంగా ఈ శుక్రవారం (అక్టోబర్ 11న) థియేటర్లలో విడుదల అవుతోంది. మరి, ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా? 


ఓటీటీతో పాటు శాటిలైట్ కూడా జీ5 సంస్థకే!
ఇటీవల కాలంలో ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ మార్కెట్ అంత బాలేదు. స్టార్ హీరోల సినిమాలను సైతం కొనడానికి ఓటీటీ సంస్థలు ఆలోచిస్తున్న రోజులు ఇవి. ఈ తరుణంలో సుధీర్ బాబు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ (టీవీలో టెలికాస్ట్) రైట్స్ విడుదలకు ముందు అమ్ముడు కావడం విశేషం. 


Maa Nanna Superhero OTT Platform: ఓటీటీతో పాటు శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ సంస్థ జీ టీవీకి చెందిన జీ 5, జీ సినిమాలు తీసుకున్నాయి. దాంతో నిర్మాతలకు ఎటువంటి టెన్షన్ లేదని చెప్పాలి.


Also Read: 'వేట్టయన్' ట్విట్టర్ రివ్యూ: సెకండాఫ్ హైలైట్... డామినేట్ చేసిన రజనీకాంత్ - ఆ ట్విస్ట్ కోసం చూడాల్సిందేనా?



'జీ 5' వెబ్ సిరీస్ 'లూజర్' తీసిన దర్శకుడే!
'మా నాన్న సూపర్ హీరో' చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు విమర్శకులతో పాటు వీక్షకులను సైతం మెప్పించిన వెబ్ సిరీస్ 'లూజర్' తీశారు ఆయన. అది జీ 5 ఓటీటీలో విడుదలైంది. ఆ సంస్థ కోసం రూపొందిన ఎక్స్ క్లూజివ్ వెబ్ సిరీస్ అది. దానికి ప్రశంసలతో పాటు మంచి వీక్షకాదరణ లభించింది. దాంతో అభిలాష్ దర్శకత్వం వహించిన సినిమాను సైతం జీ టీవీ నెట్వర్క్ తీసుకున్నట్టు ఉంది.


Also Read: జనక అయితే గనక ఓటీటీ... రైట్స్ అమ్మేసిన దిల్ రాజు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?



'మా నాన్న సూపర్ హీరో' సినిమాలో సాయి చంద్ త్రిపురనేని, షాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. సుధీర్ బాబు సరసన కథానాయికగా ఆర్నా నటించగా... రాజు సుందరం, శశాంక్, ఆమని, ఆని ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థతో కలిసి వీ సెల్యులాయిడ్స్ పతాకం మీద సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేశారు. శుక్రవారం థియేటర్లలో సినిమా విడుదల అయితే... బుధవారం రాత్రి పెయిడ్ ప్రీమియర్లు వేశారు. దానికి మంచి స్పందన లభించింది. 


'మా నాన్న సూపర్ హీరో' కథ ఏమిటంటే?
''ఇద్దరు తండ్రులు, ఓ కొడుకు చుట్టూ సినిమా కథ తిరుగుతుంది'' అని సుధీర్ బాబు తెలిపారు. ఇంటర్వ్యూలో సినిమా, కథ గురించి ఆయన మాట్లాడుతూ... ''దీనిని ఒక ముక్కోణపు తండ్రి కొడుకుల ప్రేమ కథగా చెప్పవచ్చు. తండ్రిని చూసుకోవడానికి కొడుకు పడే తపన... ఆ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ప్రేక్షకులు అందరికీ కనెక్ట్ అవుతాయి. నాన్నని ప్రేమిస్తున్న కొడుకు కథ చెబుతున్నప్పుడు ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. యూనివర్సల్ పాయింట్, కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. తొలి రెండు సన్నివేశాల్లో కథ ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆ సందర్భాలు ఎప్పుడు వస్తాయి? వచ్చినప్పుడు తండ్రి కొడుకులు ఎలా ఉంటారు? అనేది చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తారు'' అని చెప్పారు.