మంచు ఫాదర్ అండ్ డాటర్ ఎం మోహన్ బాబు (Mohan Babu), లక్ష్మీ ప్రసన్న (Lakshmi Prasanna Manchu) కలిసి నటిస్తున్న సినిమా 'దక్ష' (Daksha Movie). ఇదొక మెడికల్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో డాక్టర్ విశ్వామిత్రగా లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత మోహన్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు (మార్చి 19న) ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు తెలియ జేసింది. అంతే కాదు... సినిమా విడుదల గురించి ఒక అప్డేట్ ఇచ్చింది. 


వేసవిలో థియేటర్లలోకి రానున్న 'దక్ష'
Daksha Movie Release: డైమండ్ రత్న బాబు అందించిన కథతో 'దక్ష' సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ముందు కలెక్షన్ కింగ్ ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'కు ఆయన దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. మంచు ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.


Also Readనాన్నా... నిన్ను మిస్ అవుతున్నాం - మోహన్ బాబు బర్త్‌ డేకి మనోజ్ మంచు ఎమోషనల్ పోస్ట్‌






మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'దక్ష' చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. మలయాళ బ్లాక్ బస్టర్ మార్కో సినిమాలో ప్రధాన పాత్ర చేసిన సిద్ధిఖీ, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ దర్శకుడు నటుడు సముద్రఖనితో పాటు విశ్వంత్, చిత్రా శుక్ల, మహేష్, వీరేన్ తంబి దొరై తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా... డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.


Also Readటెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్