మంచు కుటుంబం (Manchu Family Issues)లో ఇటీవల తలెత్తిన వివాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఏపీ) మాత్రమే కాదు... దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లెజెండరీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)తో పాటు ఆయన పెద్ద కుమారుడు విష్ణు మంచు (Vishnu Manchu) ఒక వైపు ఉండగా... మరో వైపు రెండో తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj) ఉన్నారు. తండ్రికి మనోజ్ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆయన విష్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హ్యాపీ బర్త్ డే నాన్న...
ఈ రోజు నిన్ను మిస్ అవుతున్నాం!
Mohan Babu birthday wishes: 'హ్యాపీ బర్త్ డే నాన్న...' అంటూ సోషల్ మీడియాలో మనోజ్ ఒక పోస్ట్ చేశారు. అందులో మోహన్ బాబు ఫోటోకు ఓ చిన్నారి ముద్దు పెడుతున్నట్లు ఉంది. బహుశా ఆ అమ్మాయి మనోజ్ కుమార్తె అయి ఉండవచ్చు. తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మనోజ్... ''మనమంతా కలిసి జరుపుకొనే ఈ సెలబ్రేషన్ రోజు మేము నీ పక్కన లేకపోవడాన్ని మిస్ అవుతున్నాం. నీ దగ్గరకు వచ్చే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. లవ్ యు నాన్న'' అని మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
Also Read: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
మంచు కుటుంబంలో వివాదం ఏమిటనేది బయట వ్యక్తులు ఎవరికీ తెలియదు. అయితే... అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య సఖ్యత లేదనేది స్పష్టంగా ప్రజలు అందరికీ అర్థం అయింది. ఈ వివాదంలో విష్ణు వైపు మోహన్ బాబు నిలబడ్డారని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పెద్ద కుమారుడుతో పాటు హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ సమీపంలో గల జల్ పల్లి నివాసంలో ఆయన ఉంటుండగా... మనోజ్ తన భార్య, పిల్లలతో వేరుగా ఉంటున్నారు. మనోజ్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ మోహన్ బాబు ఒక ఆడియో కూడా విడుదల చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ, విద్యానికేతన్ సంస్థలలో అవకతవకల పట్ల ప్రశ్నించినందుకు తనను దూరం పెడుతున్నారని మనోజ్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆ ఇంట్లో గొడవలు ఏమిటనేది వాళ్లకే తెలియాలి.
Also Read: నిర్మాతగా నిహారిక రెండో సినిమా ఫిక్స్... లేడీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తున్న మెగా డాటర్
థియేటర్లలో విష్ణు వర్సెస్ మనోజ్!?
సినిమాల విషయానికి వస్తే... విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మైథాలజీ సినిమా 'కన్నప్ప' ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. ఇప్పటి నుంచి ఆ సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప అని విష్ణు చెబుతున్నారు. అదే రోజున మంచు మనోజ్ ఒక ప్రధాన పాత్రలో నటించిన 'భైరవం' విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ సమాచారం. ఆ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ సైతం హీరోలుగా నటించారు. అదే గనుక జరిగితే ఏప్రిల్ 25న థియేటర్లలో విష్ణు వర్సెస్ మనోజ్ పోరు చూడొచ్చు.