మెగా డాక్టర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)లో నటి మాత్రమే కాదు... నిర్మాత కూడా ఉన్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ స్థాపించిన ఆవిడ ,మొదట వెబ్ సిరీస్ ప్రొడక్షన్ చేశారు. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాతో నిర్మాతగా వెండితెరపై తొలి అడుగు వేశారు. మొదటి ప్రయత్నంలో విజయం సాధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కూడా ఒక పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆవిడ నిర్మాణంలో రెండో సినిమా చేసేందుకు సన్నాహాలు మొదలు అయ్యాయి.
మానసా శర్మ దర్శకత్వంలో నిహారిక సినిమా!నిర్మాతగా తన మొదటి సినిమాతో యదు వంశీని దర్శకుడుగా పరిచయం చేసిన నిహారిక... ఇప్పుడు రెండో సినిమాతో ఒక మహిళను దర్శకురాలిగా పరిచయం చేయడానికి రెడీ అయ్యారని తెలిసింది.
మనసా శర్మ (Manasa Sharma)... ఓటీటీలలో వెబ్ సిరీస్‌లు చూసే జనాలకు కాస్త తెలిసిన పేరు. జీ5 ఓటీటీలో వచ్చిన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'కి క్రియేటివ్ డైరెక్టర్‌గా, సోనీ లివ్ ఓటీటీలో 'బెంచ్ లైఫ్' వెబ్ సిరీస్‌కు ఆవిడ దర్శకత్వం వహించారు. ఆ రెండిటిని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకం మీద నిహారిక ప్రొడ్యూస్ చేశారు. మానసను డిజిటల్ తెరకు దర్శకురాలిగా పరిచయం చేస్తున్న నిహారిక... ఇప్పుడు వెండితెరకు దర్శకురాలుగా పరిచయం చేసే బాధ్యతను సైతం తీసుకున్నారు.
Also Read: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
మానసా శర్మ దర్శకత్వంలో నిహారిక ప్రొడ్యూస్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? ఏ జోనర్ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నారు? ఇలాంటి వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు. నిర్మాతగా తన మొదటి సినిమాతో దర్శకుడిని మాత్రమే కాదు... నటీనటులుగా చాలా మంది కొత్త వాళ్లను పరిచయం చేశారు నిహారిక. ఇప్పుడు రెండో సినిమాతో కూడా కొత్త వాళ్ళను పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయట.
Also Read: రోత... చెత్త... లేకి... ఓటీటీ రిలీజ్‌లోనూ 'లైలా'ను వదలట్లేదు - ట్రోల్స్ షురూ
ఒకవైపు నిర్మాతగా కంటిన్యూ అవుతూ... మరోవైపు కథానాయికగా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు నిహారిక కొణిదెల. తెలుగులో కూడా రెండు మూడు సినిమాలు చర్చలు దశలో ఉన్నాయని సమాచారం.