Megastar Chiranjeevi: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్

మెగాస్టార్ ఫ్యాన్స్ ఇండియాలో మాత్రమే కాదు... అమెరికాలోనూ ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ. ఆయన మెగాస్టార్ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అమెరికాలో ఎండీగా వైద్య రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ... చిరు మీద డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ అభిమానంతో ఇసుమంత కూడా తగ్గలేదు. చిరు సినిమా రిలీజ్ అయితే అమెరికాలోని టెక్సాస్ సిటీలో ఆయన చేసే హంగామా ఒక స్థాయిలో ఉంటుంది.

చిరు మీద ఇస్మాయిల్ అభిమానం ఎంతంటే... తన టెస్లా కారుకు 'మెగాస్టార్' అని వచ్చేలా నంబర్ ప్లేట్ వేయించేంత! టోటల్ టెక్సాస్ చూస్తే... ఈ నంబర్ ప్లేట్ ఉన్న కారు ఇదొక్కటే ఉంటుంది.
'మెగాస్టార్' నంబర్ ప్లేట్ ముందు ఫోటోకు ఫోజ్ ఇచ్చిన అమెరికన్. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టెస్లా ఛార్జింగ్ స్టేషన్ లో డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ 'మెగాస్టార్' కార్