Touch Me Not web series release date and streaming platform: జియో హాట్ స్టార్ ఓటీటీ కొన్ని రోజుల క్రితమే 'టచ్ మీ నాట్' అనే వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో సైకోమెట్రి అనే కొత్త సబ్జెక్టును పరిచయం చేయబోతున్నారు మేకర్స్.


'టచ్ మీ నాట్' ట్రైలర్ అవుట్
నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్, పూనచ సాంచో తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'టచ్ మీ నాట్'. 'అశ్వత్థామ' ఫేమ్ డైరెక్టర్ రమణ తేజ ఈ సిరిస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన 'టచ్ మీ నాట్' సిరీస్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ ఓ బిల్డింగ్ బ్లాస్ట్ అయ్యే క్రైమ్ సీన్ తో స్టార్ట్ అయింది. "లైఫ్ లో అందరికీ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. కానీ కొన్నిటిని ప్రాణం కన్నా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఈ కేస్ ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నావ్... సైకోమెట్రి" అనే డైలాగ్ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ తర్వాత సైకోమెట్రి తెలిసిన వ్యక్తిగా దీక్షిత్ శెట్టిని పరిచయం చేశారు. "ఈ పిల్లాడు శవాలను ముట్టుకుని చంపింది ఎవరో చెప్తాడట" అంటున్నప్పుడు ట్రైలర్ లో వచ్చిన సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 


"వీరందరూ చనిపోయినప్పుడు ఒక్కొకరూ ఒక్కో నెంబర్ చూశారు... ఎన్ని రోజులు రిషిని గమనిస్తూ ఉంటావ్? వాడి సైకోమెట్రిని బయటకు తీయగలిగే కరెక్ట్ పర్సన్ దొరికే వరకు... ఆ ఒక్కరోజు ఎన్నో జీవితాలను మార్చేసింది... ఇది కూడా ఆ మారుతి అపార్ట్మెంట్ కేసులాగే అనిపిస్తుంది... చనిపోయింది ఎక్కువగా లేడీసే... చేసిన తప్పును ఫైర్ యాక్సిడెంట్ గా కవర్ చేశారు... సో వి ఆర్ లుకింగ్ ఫర్ ఎ గోస్ట్... ఒక ఫజిల్ ను సాల్వ్ చేయడానికి కావలసిన 100 పీసెస్ లో ఒక్క పీస్ తెలుసుకొని అంత కాన్ఫిడెంట్ గా ఉండకు" అనే డైలాగ్ లు, ట్రైలర్ లో ఉన్న క్రైమ్ యాక్షన్ సీన్స్, సస్పెన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ట్రైలర్ చివర్లో "ఈ గేమ్ ఎండ్ అవ్వాలంటే మనిద్దరిలో ఎవరో ఒకరి లైఫ్ అండ్ అవ్వాలి" అనే డైలాగ్ కూడా బాగుంది. మరి దీక్షిత్ శెట్టి పవర్ ని వాడుకుని ఆ మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు? అనేది తెలియాలంటే సిరీస్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.


'టచ్ మీ నాట్' రిలీజ్ ఏప్రిల్ లో... 
ఇక ఈ సిరీస్లో సస్పెండ్ తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని ట్రైలర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఇదిలా ఉండగా ట్రైలర్ ద్వారానే 'టచ్ మీ నాట్' సిరీస్ ని జియో హాట్ స్టార్ లో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.