Laila Movie Trolls: రోత... చెత్త... లేకి... ఓటీటీ రిలీజ్‌లోనూ 'లైలా'ను వదలట్లేదు - ట్రోల్స్ షురూ
Laila OTT Streaming: విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా థియేటర్లలో విడుదలైనప్పుడు విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఎక్కువ రోజులు సినిమా ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరోసారి విమర్శల జడవాన మొదలైంది.
యువ కథానాయకుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) కెరీర్‌లో 'లైలా' (Laila Movie) చాలా స్పెషల్. లేడీ గెటప్ వేసిన ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. విశ్వక్ ఎఫర్ట్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు నచ్చాయి. అయితే సినిమా మాత్రం నచ్చలేదు. విడుదలైనప్పుడు విపరీతమైన విమర్శలు వచ్చాయి. థియేటర్లలో ఎక్కువ రోజులు సినిమా ఆడలేదు. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా ఏరియాలో వాష్ అవుట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. దాంతో మరోసారి విమర్శలు జడవాన మొదలైంది.
రోత... చెత్త.. లేకి కామెడీ...
'లైలా'ను ఏకీపారేస్తున్న యూత్!
'ఇంత రోత చెత్త సినిమా ఎలా ఒప్పుకున్నావ్ అన్నా' అంటూ విశ్వక్ సేన్ (Vishwak Sen Troll)ను ఒక ప్రేక్షకుడు ప్రశ్నించాడు. సాధారణంగా విశ్వక్ సేన్ సినిమాల కంటెంట్ తనకు నచ్చుతుందని కానీ 'లైలా' చూశాక విశ్వక్ ఎలా ఒప్పుకున్నాడని ట్వీట్ చేశాడు. 'లైలా' కంటే 'మెకానిక్ రాకీ' ఎంత బాగుందోనంటూ పేర్కొన్నాడు. దీనికి వైసిపి వాళ్ళు బాయ్ కాట్ ట్రెండ్ చేయడం, టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయడం దేనికో అన్నట్లు నవ్వాడు.
'లైలా' తీవ్రంగా నిరాశ పరిచిందని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. కథతో పాటు డైరెక్షన్ అవుట్ డేటెడ్ అని తేల్చి పారేశాడు. విశ్వక్ సేన్ తన ప్రతిభకు తగ్గ కథలను ఎంపిక చేసుకోవడం లేదని చెప్పడంతో పాటు బరువు తగ్గాలని సలహా ఇచ్చాడు.
మాకు ఏంట్రా ఈ చండాలం...
హీరోయిన్ పార్క్ సీన్ మీద ట్రోల్స్!
'లైలా' సినిమాలో హీరోయిన్ ఆకాంక్ష శర్మను విశ్వక్ సేన్ తన భుజాల మీద ఎక్కించుకుని పార్కులో తిరిగే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ అయితే విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఏంటి ఈ చండాలం అంటూ నెటిజనులు విరుచుకుపడుతున్నారు. అందులో కంటెంట్ మీద కొంత మంది ట్రోల్ చేస్తుంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ మీద మరి కొంత మంది ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ రెండో స్థానంలో ట్రెండ్ అవుతుంది.