లెజెండరీ నటుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు పుట్టినరోజు ఇవాళ (మార్చి 19). ఆయన బర్త్ డే స్పెషల్ కింద కన్నప్ప సినిమా నుంచి ఆయన క్యారెక్టర్ మహాదేవశాస్త్రి పరిచయ గీతం ఓం నమః శివాయ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ సాంగ్ ప్రోమో చూడండి.
శంకర్ మహదేవన్ గాత్రంలో...
పరమ శివునికి అపర భక్తుడైన కన్నప్ప కథతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ నిర్మాణ వ్యయంతో 'కన్నప్ప' (Kannappa Movie) రూపొందుతున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో హిందీ తమిళ కన్నడ తెలుగు మలయాళ భాషలకు చెందిన పలువురు అగ్ర నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు తండ్రి, లెజెండరీ నటుడు మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్రను చేస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన పరిచయ గీతం 'ఓం నమః శివాయ'ను శంకర్ మహదేవన్ ఆలపించారు.
శివుని భక్తి గీతాలు అంటే భారతీయ ప్రేక్షకులు అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు శంకర్ మహదేవన్. ఇప్పుడు ఈ ఓం నమః శివాయ పాటను కూడా ఆయన అద్భుతంగా ఆలపించారు. ఆ పాట వింటుంటే ఒక భక్తి భావన కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ పాటకు స్టీఫెన్ దేవాన్సీ అద్భుతమైన బాణీ అందించారు. తెలుగుతోపాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలలో పాటను విడుదల చేశారు. కన్నప్ప నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా ఇది మూడో పాట అన్నమాట.
Also Read: నాన్నా... నిన్ను మిస్ అవుతున్నాం - మోహన్ బాబు బర్త్ డేకి మనోజ్ మంచు ఎమోషనల్ పోస్ట్
కన్నప్ప సినిమాలో పరమశివుని పాత్రలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ నటించగా... రుద్ర పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించారు. పార్వతి పాత్రను తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ పోషించారు. ఇంకా ఇతర కీలక పాత్రలలో మోహన్ లాల్, ముఖేష్ ఋషి, శరత్ కుమార్ తదితరులు కనిపించనున్నారు. విష్ణు జోడిగా ప్రతి ముకుందన్ నటించారు. 'కన్నప్ప' సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. సినిమా మీద విష్ణు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Also Read: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్