దేవుళ్ళు, ప్రజల నమ్మకాల నేపథ్యంలో ఫాంటసీ సినిమాలు తెలుగులో వచ్చాయి. విజయాలు సాధించాయి. అందులో మహిళా ప్రాధాన్య సినిమా అంటే అనుష్క 'అరుంధతి' గుర్తుకు వస్తుంది. ఆ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన 'అమ్మోరు' కూడా ఆ తరహా చిత్రమే. ఇప్పుడీ కోవలో వస్తున్న మరో సినిమా 'ఆదిపర్వం'. 


నాగలాపురం నాగమ్మగా లక్ష్మీ మంచు
లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఆదిపర్వం'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. త్వరలో ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వరరావు చిత్ర సమర్పకులు. అన్వికా ఆర్ట్స్, ఎ వన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Also Read: బ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి! హాస్య బ్రహ్మ నటనతో ఏడిపించిన పాత్రలు ఏవో తెలుసా?


'ఆదిపర్వం'లో నాగలాపురం నాగమ్మ పాత్రలో లక్ష్మీ మంచు నటన విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూస్తారని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ సినిమా కథ 1974 నుంచి 1992 మధ్య జరుగుతుందని, ఇదొక పీరియాడిక్ డ్రామా అని తెలిపారు. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... ''సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ హైలైట్ అవుతుంది. ప్రజెంట్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి'' అని చెప్పారు. 


Also Readస్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?



'ఆదిపర్వం' ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... ''లక్ష్మీ మంచు గారు అద్భుతమైన పాత్ర చేశారు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. గ్రాఫిక్స్ వర్క్ చివరి దశకు చేరుకుంది. మంచి సినిమా అందించడం కోసం సంజీవ్ మేగోటి అహర్నిశలు కష్టపడుతున్నారు. నాగమ్మగా చేస్తున్న లక్ష్మీ మంచు ఎంతో రిస్క్ చేసి రెండు ఫైట్స్ చేశారు. అవి సినిమాకు మరో హైలెట్. క్షేత్ర పాలకుడిగా ప్రత్యేక పాత్రలో శివ కంఠమనేని అద్భుతంగా చేశారు'' అని చెప్పారు. సినిమా రషెష్ చూశాక తమ కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని, 'ఆదిపర్వం' ఘన విజయం సాధిస్తుందని సహ నిర్మాతల్లో ఒకరైన గోరెంట శ్రావణి, చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు.  


Also Read: హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం! ఆయన్ను ఎందుకు 'గురూజీ' అంటున్నారు? 



లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శివ కంఠమనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నొరోన్హ, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సుహాసిని, హ్యారీ జోష్, సమ్మెట గాంధీ, యోగి కాత్రి, గడ్డం నవీన్, 'ఢిల్లీ' రాజేశ్వరి, 'జెమినీ' సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వర్ రావు, సాయి రాకేష్, వనితా రెడ్డి, గూడా రామకృష్ణ, రవి రెడ్డి, దేవి శ్రీ ప్రభు, దుగ్గిరాల వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పా ప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: ఎస్.ఎన్. హరీష్, కళా దర్శకత్వం: కేవీ రమణ, సంగీతం: మాధవ్ సైబా - సంజీవ్ మేగోటి, బి. సుల్తాన్ వలి - ఓపెన్ బనానా - లుబెక్ లీ మార్విన్, సాహిత్యం: సాగర్ నారాయణ్ - రాజాపురం శ్రీనాథ్ - వూటుకూరి రంగారావు - మనేకుర్తి మల్లికార్జున - రాజ్ కుమార్ సిరా, కూర్పు: పవన్ శేఖర్ పసుపులేటి, పోరాటాలు: నటరాజ్, నృత్య దర్శకత్వం: సన్ రేస్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఘంటా శ్రీనివాస రావు, సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి - ప్రదీప్ కాటుకూటి - రవి దశిక - రవి మొదలవలస - శ్రీరామ్ వేగరాజు, నిర్మాత: ఎమ్.ఎస్.కె, రచన - దర్శకత్వం: సంజీవ్ మేగోటి.