Kangana Ranaut Fires On Poonam Pandey: ప్రస్తుతం నటి పూనమ్ పాండేపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆమె తీరుపై మండిపడుతూ సినీ సెలబ్రిటీలు వరుసగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, మందిర బేడీ, బిపాషా బసు వంటి నటీమణులంతా పూనమ్ తీరుపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఇది చీప్ పబ్లిసిటీ అని, ఇలాంటి వాటిని సహించకూడదంటూ పూనమ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి తప్పుడు వార్తను ప్రచారం చేయించి అందరి ఎమోషన్స్‌తో ఆడుకున్న పూనమ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కాగా పూనమ్ క్యాన్సర్‌తో కన్నుమూసినట్టుగా తన టీంతో ఫేక్ న్యూస్ ప్రచారం చేయించిన సంగతి తెలిసిందే. సర్వైకల్ క్యాన్స్‌తో మృతి చెందిందని, తన మరణవార్తను ప్రకటించేందుకు తాము చింతిస్తున్నామని.. ఆమె మరణం బాధిస్తోందంటూ ఆమె పీఆర్ టీం శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది పూనమ్ ఆఫీషియల్ అకౌంట్ నుంచి రావడంతో అంతా నిజమని నమ్మేశారు. ఆమె మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ బి-టౌన్ సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజలకు వరకు ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె మరణావార్తను జీర్ణించుకోలేక షాక్‌లోనే ఉండిపోయారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పూనమ్ ఓ వీడియో షేర్ చేసింది.
తాను బతికే ఉన్నానంటూ అందరికి జలక్ ఇచ్చింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే తాను తన మరణవార్తను వాడుకున్నానని చెప్పింది. ఇప్పుడంతా సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నారని, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఈ మహామ్మారి నుంచి బయటపడోచ్చని ఆమె పేర్కొంది. అయితే ఆమె సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనుకోవడం మంచిదే ఉద్దేశమే అయినా, దానికోసం ఆమె ఎంచుకున్న విధానం కరెక్ట్ కాదు అంటున్నారు. ఇది ఒక చీప్ పబ్లిసిటీ అని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: పూనమ్ పాండే తీరుపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ - ఏమన్నాడంటే..
ఇది ఆ సంస్థ కోసం చేసిన చీప్ పబ్లిసిటీ..
ఈ క్రమంలో ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సైతం పూనమ్ తీరును వ్యతిరేకించారు. ఆయన పూనమ్ వీడియోను షేర్ చేస్తూ "ఇక్కడ చూడండి. నిజానికి ఇది @thehauterrfly మార్కెటింగ్ కాంపైన్. ఆమె వీడియో చివరిలో ఆమె కుడివైపు కార్నర్‌లో పైన చూస్తే ఆ సంస్థ లోగో కనిపిస్తుంది. ఇది ఎంత దయనీయమైన, పాపమో చూడిండి. ఇలాంటి చర్యలను ఎప్పటికీ క్షమించకూడదు" అంటూ కామెంట్ చేశాడు. ఆయన పోస్ట్‌పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా స్పందిస్తూ అవును అంటూ కామెంట్ చేసింది.
ఆమెను బాయ్‌కాట్ చేయాలి..
మరోవైపు నటి మందిర బేడి సైతం పూనమ్‌పై విరుచుకుపడింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఓ నోట్ షేర్ చేసింది. "ఈ మూర్ఖపు మహిళకు ఇకపై ఎలాంటి మద్దతు ఇవ్వకూడదు. ఇప్పటికే ఆమెకు అర్హతకు మించి అటెన్షన్ ఇచ్చాము. ఆమె చేసింది మాత్రం సహించరానిది. ఇది అత్యంత దుర్భరమైన, నీచమైన పబ్లిసిటీ. అయినా కూడా ఈ దయనీయమైన ప్రపంచంలో ఇలాంటి పబ్లిసిటీని కూడా స్వాగతించేవారు ఉన్నారు. ఇది ఎప్పటికీ మంచిది కాదు. తనని బాయ్‌కాట్ చేయాలి" #sickening Cancel the lowlife అంటూ హ్యాష్ ట్యాగ్‌ను జతచేసింది.