డిసెంబర్ వచ్చేసింది. ఏడాది (2024)కి టాటా బై బై చెప్పడానికి ఎంతో సమయం లేదు. మరో రెండు మూడు వారాల్లో 2025 వచ్చేస్తుంది. కొత్త ఏడాది మొదటి రోజు ఏయే సినిమాలు వస్తాయని ఎదురు చూసే ప్రేక్షకులు ఉంటారు. అందులో కొంత మంది హాలీవుడ్ సినిమాల కోసం చూస్తారు. వాళ్ళ కోసం ఒక అప్డేట్... జనవరి 1న ఓ హాలీవుడ్ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.
తెలుగులోనూ జనవరి 1న 'క్రావెన్: ది హంటర్'
మార్వెల్ కామిక్ క్యారెక్టర్ 'క్రావెన్' ఆధారంగా రూపొందిన అమెరికన్ సూపర్ హీరో యాక్షన్ ఫిల్మ్ 'క్రావెన్: ది హంటర్'. అమెరికాలో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోనీ పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది. ఇప్పుడీ సినిమాను తెలుగు పేక్షకుల ముందుకు కూడా తీసుకు వస్తోంది.
'క్రావెన్: ది హంటర్' సినిమాకు జెసి చందూర్ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో జనవరి 1న ఇండియాలో విడుదల కానుంది. భారతీయ భాషల్లో సినిమాను అనువదించడంతో పాటు లోకల్ ఫ్లేవర్ ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ సినిమాకు ఆర్ రేటింగ్ వచ్చింది.
క్రావెన్ క్యారెక్టర్‌లో ఆరాన్ టైలర్ - జాన్సన్ నటించగా... మిగతా కీలక పాత్రల్లో అరియనా డే బోస్, ఫ్రెడ్ హేచినగర్, క్రిస్టోఫర్ అబ్బాట్, రస్సెల్ క్రో, మురాట్ సెవన్, యూరి కోలోకొల్నికోవ్ నటించారు.
'క్రావెన్: ది హంటర్' కథ ఏమిటి? ఎలా ఉంది?
తమ సినిమాకు ఆర్ రేటింగ్ రావడం చాలా సంతోషంగా ఉందని 'క్రావెన్: ది హంటర్' దర్శకుడు జెసి చందూర్ చెప్పారు. తన తల్లి మరణం తర్వాత హాఫ్ బ్రదర్ దిమిత్రి, తండ్రి నికొలాయ్ తో కలిసి డ్రగ్ ఆపరేషన్స్ భరతం పట్టాలని సెర్గీ క్రావెన్ బలమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి.
'క్రావెన్: ది హంటర్' సినిమా గురించి దర్శకుడు జెసి చందూర్ మాట్లాడుతూ... ''ఇదొక యాక్షన్ ఫిల్మ్. ప్రేక్షకులు ఒక ఆర్గానిక్ విలన్ క్యారెక్టర్ చూస్తారు. రివెంజ్, ఎమోషన్స్ కూడా ఉంటాయి.'' అని చెప్పారు. అమెరికాలో సినిమాకు వస్తున్న స్పందన పట్ల సోనీ పిక్చర్స్ సంతోషం వ్యక్తం చేస్తోంది. మరి, ఇండియాలో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read: ఆస్కార్ 2025 రేసులో ఇండియన్ సినిమా అవుట్... టాప్ 10లో 'లాపతా లేడీస్' లేదు