Fahadh Faasil: షూటింగ్ పేరుతో హాస్పిటల్ లో రచ్చ, ఫహద్ ఫాజిల్‌పై హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ వివాదంలో చిక్కుతున్నారు. కేరళ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆయనపై కేసు నమోదు చేసింది. ఇంతకీ ఆయనపై కేసు ఎందుకు ఫైల్ అయ్యిందంటే?

Continues below advertisement

Case Registered Against Fahadh Faasil: దక్షిణాది సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నారు ఫహద్ ఫాజిల్. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆరిస్టుగా, పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయన ప్రత్యేకత. వైవిధ్య పాత్రల్లో నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. ‘పుష్ప‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ గా అద్భుత నటన కనబర్చారు. ప్రస్తుతం ‘పుష్ప 2‘లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ‘పుష్ప 2‘లో నటిస్తూనే, ఇతర సినిమాలు కూడా చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించి ‘ఆవేశం‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Continues below advertisement

ఫహద్ ఫాజిల్ పై హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు

తాజాగా షెకావత్ సార్ ఓ సినిమా వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా ఆయనపై కేరళ మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?  ఫహద్ ఫాజిల్ నటుడిగా రాణిస్తూనే నిర్మాతగానూ చేస్తున్నారు. ఆయన నిర్మాణంలో తాజాగా ‘పైంకిలి’ అనే సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అంగమలై తాలుక హాస్పిటిల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రబృందం వ్యవహరించిన తీరుపై వివాదాస్పదం అయ్యింది.  

ఇంతకీ హాస్పిటల్ లో ఏం జరిగిందంటే?

హాస్పిటల్ పరిధిలో సినిమా షూటింగ్ నిర్వహించుకుంటామని చెప్పి, ఏకంగా ఎమర్జెన్సీ రూమ్ లోనే షూట్ చేశారట. ఎమర్జెన్సీ రూమ్ లో పర్మిషన్ లేదని చెప్పినా పట్టించుకోలేదట. పేషెంట్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, పట్టించుకోకుండా పెద్ద పెద్ద లైట్లు వేసి ఇబ్బందులకు గురి చేశారట. అంతేకాదు, షూటింగ్ సందర్భంగా హాస్పిటల్ స్టాఫ్‌ను కూడా అందులోకి రానివ్వలేదట. ఏకంగా 50 మందికి పైగా షూటింగ్ సిబ్బంది ఎమర్జెన్సీ యూనిట్ లోకి వెళ్లి చాలా చేపు ఇబ్బంది పెట్టారట. ఈ విషయంపై కొందరు కేరళ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కమిషన్ ఎర్నాకులం జిల్లా మెడికల్ అధికారితో పాటు అంగమలై తాలూక హాస్పిటల్ సూపర్ డెంట్ ఈ విషయాన్ని సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అటు ఫహద్ ఫాజిల్ పై కేసు నమోదు చేయడంతో పాటు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

నిజానికి సినిమా షూటింగ్ కోసం హాస్పిటల్ సెట్ వేయాల్సి ఉన్నా, హాస్పిటల్ లోనే నిర్వహించాలని చిత్రబృందం భావించింది. ముందుగా హాస్పిటల్ పరిధితో షూటింగ్ చేసుకుంటామని చెప్పి, ఆ తర్వాత ఐసీయూలో షూట్ చేశారు. ఎమర్జెన్సీ వార్డులో తక్కువ స్పేస్ ఉన్నప్పటికీ షూట్ పేరుతో చిత్రబృందం నానా రచ్చ చేశారట. హాస్పిటల్ మెయిన్ గేట్ నుంచి రోగుల బంధువులను కూడా రాకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులు రావడంతో హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారణ మొదలు పెట్టింది. ప్రస్తుతం ప్రస్తుతం ఫహద్‌ ఫాజిల్ ‘పుష్ప 2’తో పాటు ‘వేట్టయాన్’, ‘మారీషన్‌’ అనే సినిమాల్లో నటిస్తున్నాడు.

Also Read: నేను బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నా- షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రముఖ నటి హీనా ఖాన్

Continues below advertisement
Sponsored Links by Taboola