Sonakshi Sinha Pregnancy Rumours: పెళ్ళైన వారం రోజుల్లోనే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హాస్పిటల్ లో కనిపించింది. భర్తతో కలిసి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో దర్శనం ఇచ్చింది. ఈ నేపథ్యంలో బోలెడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పుడే ప్రెగ్నెంట్ అయ్యిందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. గర్భం దాల్చాకే పెళ్లి చేసుకున్నారని మరికొంత మంది అంటున్నారు. అసలు ఇంతకీ సోనాక్షి హాస్పిటల్ కు ఎందుకు వెళ్లిందో ఇప్పుడు తెలుసుకుందాం..
రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సోనాక్షి
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ అనే నటుడితో చాలా కాలంగా రిలేషన్ షిప్ కొనసాగించింది. జూన్ 23న అతడితో కలిసి సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోనాక్షి తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సినీ సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పారు.
హాస్పిటల్ కు వెళ్లిన సోనాక్షి దంపతులు
పెళ్లైన వారం రోజుల్లోనే సోనాక్షి దంపతులు హాస్పిటల్ కు వెళ్లారు. ముంబై కోకిలా బెన్ హాస్పిటల్ కు వెళ్లి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ చెకప్ కోసమే ఆమె హాస్పిటల్ కు వెళ్లినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చిందా? అని మరికొంత మంది అంటుంటే.. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ కావచ్చని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ అని తెలియడం వల్లే పెళ్లి చేసుకున్నారేమో? అని ఇంకొంత మంది అంటున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నిజానికి సోనాక్షి సిన్హా గర్భం దాల్చినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చేశారట. సోనాక్షి పెళ్లి సందర్భంగా తీరికలేకుండా గడపడంతో కాస్త అనారోగ్యానికి గురయ్యారట. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ప్రస్తుతం ఆయన హెల్త్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన్ని చూసేందుకే సోనాక్షి సిన్హా దంపతలు హాస్పిటల్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. తండ్రి కోసం హాస్పిటల్ కు వెళ్తే ప్రెగ్నెన్సీ అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని సోనాక్షి సన్నిహితుల దగ్గర బాధ పడినట్లు తెలుస్తోంది.
పెళ్లి విషయంలో విమర్శలు ఎదుర్కొన్న సోనాక్షి
సోనాక్షి పెళ్లి విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నది. హిందూ అమ్మాయి ముస్లీంను పెళ్లి చేసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నించారు. సోషల్ మీడియాలోనూ బాగా ట్రోలింగ్ జరిగింది. పెళ్లి తర్వాత సోనాక్షి మతం మారుతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కూతురు పెళ్లి విషయంలో శత్రుఘ్న కూడా అయిష్టంగానే ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమె పెళ్లికి తల్లిదండ్రులు సహా ఫ్యామిలీ అంతా హాజరైంది. మరోవైపు తన మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ఆమె ఓ కామెంట్ చేసింది. తన దృష్టిలో ప్రేమ పెద్ద మతం అంటూ వ్యాఖ్యానించింది.
Read Also: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్ కామెంట్స్