బాలీవుడ్ నిర్మాతలకు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్ కుమార్ రావు కథానాయకుడిగా నటించిన 'భూల్ చుక్ మాఫ్' చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ అనౌన్స్ చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పివిఆర్ ఐనాక్స్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ కేసులో నిర్మాతలకు చుక్కెదురు అయింది. 

జూన్ 16వ తేదీ వరకు రిలీజ్ చేయొద్దుమే 9న 'భూల్‌ చుక్ మాఫ్' సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే... సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విడుదల క్యాన్సిల్ చేశారు. థియేటర్లలో రిలీజ్ చేయకుండా... మే 16వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 

'భూల్ చుక్ మాఫ్' సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలనుకోవడం పట్ల పివిఆర్ ఐనాక్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. థియేటర్లలో సినిమాను విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. అందులో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

Also Readమృణాల్ ఠాకూర్‌తో పెళ్లి పుకార్లకు క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో... మరాఠీ అమ్మాయి తెలుగింటి కోడలు కాదా?

థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తామని నిర్మాతలు తమతో ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఓటీటీలో విడుదల చేయడం వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని పేర్కొంది. ఢిల్లీ సహా పంజాబ్ రాష్ట్రంలోని కొన్ని నగరాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశామని, ప్రేక్షకులు టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని, ఈ సినిమా రిలీజ్ కోసం స్క్రీన్స్ అలాట్ చేశామని వివరించింది పివిఆర్ ఐనాక్స్. థియేటర్ రిలీజ్ క్యాన్సిల్ చేయడం వల్ల తమకు నష్టాలు వస్తాయని వివరించింది. ఈ కేసులో నిర్మాతలకు వ్యతిరేకంగా ప్రస్తుతానికి తీర్పు వచ్చింది. జూన్ 16వ తేదీ వరకు సినిమా విడుదల చేయకూడదని బాంబే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. తదుపరి వాయిదాను జూన్ 16కు వేసింది. అప్పటి వరకూ సినిమాను విడుదల చేయకూడదని పేర్కొంది. మరి నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్.

Also Readకనిపించేది కాసేపే అయినా భారీ రెమ్యూనరేషన్... 'జైలర్ 2' కోసం బాలకృష్ణకు ఎన్ని కోట్లు ఆఫర్ చేశారంటే?