Ennallo Vechina Hrudayam Serial Today Episode గాయత్రీ ఏం తప్పు చేయలేదని నిరూపించే అవకాశం దొరికిందని త్రిపుర బాల తీసుకొచ్చిన పేపర్స్ పట్టుకొని లాయర్ దగ్గరకు బయల్దేరుతారు. ఊర్వశి, రమాప్రభలు మొత్తం వినేసి గాయత్రీ తప్పు లేదని తెలిస్తే దాన్ని దేవతని చేసేస్తారని ఇక దాన్ని ఆ ఇంటి నుంచి తరిమేయలేమని అనుకుంటారు. ఎవరు ఎన్ని చేసినా ఆపలేరని రమాప్రభ అంటుంది. అనంత్ ఆఫీస్‌కి వెళ్తుంటే గాయత్రీ వెంట వస్తుంది. అనంత్ కారు డోర్ తీస్తుంటే వాసుకి ఆపి ఎక్కడికిరా కారు తీసుకున్నావ్ అంటుంది.
అనంత్: ఆఫీస్‌కి వెళ్తున్నా పిన్ని.వాసుకి: నువ్వు ఆఫీస్‌కి వెళ్లు కానీ ఆ కారు తీసుకెళ్లకు.గాయత్రీ: అది ఆయన కారు ఆయన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు.బామ్మ: అది వాడి కారు కాదు కుటుంబం కారు.వాసుకి: అర్థమైంది కదా ప్రస్తుతానికి కుటుంబానికి చెందిన ఈ కారు వాడు తీసుకెళ్లడానికి వీళ్లేదు. గాయత్రీ: అదేంటి బామ్మ గారు బిజినెస్‌లు కూడా ఈ ఇంటివే కదా. ఇన్ని రోజులు అవి చూసుకుంటున్నది ఆయనే కదా. అలాంటిది ఆయనకు కారు వాడుకునే హక్కు లేదా.బామ్మ: అరేయ్ అనంత్ నీ పెళ్లాం తప్పు లేదని నువ్వు ఎప్పుడైతే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లావో అప్పుడే ఈ ఇంటి మనిషిగా ఈ ఇంటి హక్కు కోల్పోయావు. అప్పటి నుంచే నువ్వు ఈ ఇంటి నుంచి సౌకర్యాలు కూడా కోల్పోయావు. లేదు ఈ వైభోగం నువ్వు పొందాలి అనుకుంటే నీ భార్య తప్పు ఒప్పుకొని నువ్వు మాత్రమే ఈ ఇంట్లోకి రా. యశోద: మనసులో నా కొడుకు నా కళ్ల ముందే పరాయివాడు అయిపోయాడే.ఫణి: ఇదేదో నాకు కలిసొచ్చేలా ఉందే.అనంత్: నా నిర్ణయం ఆ రోజే చెప్పేశాను అని తండ్రి చేతిలో తాళాలు పెట్టి గాయత్రీకి చెప్పి వెళ్తానని అంటాడు. నన్ను నమ్ముకొని వచ్చి నా వెనకున్న భార్యకి అండగా ఉంటాను. ప్రస్తుతానికి మీ వల్ల ఎలాంటి సమస్య వచ్చినా మేం ఇద్దరం సంతోషంగా ఎదుర్కొంటాం.యశోద: ఎందుకురా నీకు ఇంత పంతం.అనంత్: ఇది పంతం కాదు నా భార్య మీద నాకు ఉన్న నమ్మకం. నా భార్య ఏ తప్పు చేయదు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే భరోసా. ఆటోలో అనంత్ ఆఫీస్‌కి వెళ్తాడు. బామ్మ: మనసులో నిన్ను కష్టపెట్టాలి అన్నది నా ఉద్దేశం కాదురా. నీ భార్య వల్ల మళ్లీ కన్నయ్యకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని నిన్ను దూరం పెట్టాను.
అనంత్ అలా ఆటోలో వెళ్లడం చూసి బామ్మ, యశోద ఏడుస్తారు. గాయత్రీ అందర్ని కోపంగా చూసి వెళ్లిపోతుంది. ఫణి వాళ్లు చాలా సంతోషపడతారు. ఈ అవకాశం వాళ్లకి కలిసి వచ్చేలా ఉందని సంబర పడతారు. బామ్మ మాటలు వాడుకొని అనంత్‌ని ఆఫీస్‌లో సైడ్ చేసేస్తా అని ఫణి అంటాడు. ఆఫీస్ ఇక మనదే అని వాసుకి అంటుంది. బాల, త్రిపురలు లాయర్ ఇంటికి వస్తారు. త్రిపుర ఆ లాయర్ ముందు ఆ కొరియర్ పేపర్లు విసురుతుంది. అది చూసి లాయర్ షాక్ అయిపోతాడు. మా చెల్లి మీ దగ్గరకి రాకుండానే మా చెల్లికి నోటీసులు ఇచ్చారా అని కోప్పడుతుంది. నాకు సంబంధం లేదని లాయర్ అని బాల, త్రిపురని కోప్పడతాడు. అంత క్లియర్‌గా మీ అడ్రస్ ఉంటే ఎందుకు అబద్ధాలు చెప్తారని త్రిపుర వాళ్లు అంటారు. ఎంత చెప్పినా లాయర్ ఏం సంబంధం లేదని చెప్పి పంపేస్తాడు. తర్వాత వెంటనే ఫణికి కాల్ చేసి విషయం చెప్తాడు.
బాల త్రిపురతో అతను అబద్ధం చెప్తున్నాడు. లేదంటే కంగారు పడడు కదా అని అంటాడు. అప్పుడు త్రిపురకు మ్యాటర్ అర్థమవుతుంది. అతనితో నిజం ఎలా చెప్పించాలి అనుకుంటుంది. ఇద్దరూ ఆలోచిస్తుంటారు. అనంత్ ఆఫీస్‌కి వస్తాడు. మనీ పే చేస్తుంటే అనంత్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఇంతలో వాచ్మెన్ వచ్చి డబ్బులు ఇస్తాడు. అనంత్ ఆఫీస్‌కి వెళ్లి తన అకౌంట్ నిల్ చూపిస్తుంది ఏంటి అని మేనేజర్‌ని అడుగుతాడు. దాంతో ఆయన ఫణి సార్‌ని అడగమని అంటారు. అనంత్ తన గదిలోకి వెళ్లే సరికి అనంత్ స్థానంలో ఫణి కూర్చొంటాడు. ఇది ఎవరి నిర్ణయమో అర్థమైంది కదా నువ్వు ఇక ఈ కంపెనీకి ఎండీవి కాదు సాధారణ ఎంప్లాయ్‌వే. నీ అకౌంట్స్ కార్డులు ఏం పని చేయవు. నీ ప్లేస్ కూడా అది అని అందరి ఎంప్లాయ్‌ల పక్కన చూపిస్తాడు. ఇదంతా బామ్మ నిర్ణయం అని అంటాడు.
అనంత్ బాధగా వెళ్లి అందరితో పాటు కూర్చొంటాడు. అనంత్ అలా కూర్చొవడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఫణి వచ్చి అందరి పనులు చూసుకోండి అంటాడు. అనంత్ తండ్రి ఆఫీస్‌కి వస్తాడు. అనంత్‌ని అందరితో పాటు చూసి నువ్వేంట అనంత్ ఇక్కడ కూర్చొన్నావ్ అంటాడు. ఈ రోజు నుంచి నా ప్లేస్ ఇదే అంట అని చెప్తాడు. ఎవరు చెప్పారు అని ఆయన అడిగితే ఎండీ స్థానంలో కూర్చొన్న ఫణిని చూపిస్తాడు. కొడుకుని తీసుకొని వెళ్లి ఫణి ఏంట్రా ఇది అని అడుగుతాడు. బాల లేనప్పుడు ఇదంతా చూసుకొని ఇంత సక్సెస్ చేసింది వీడు. వీడిని సాధారణ ఎంప్లాయ్‌లా కూర్చొపెడతావేంట్రా అని అంటాడు. ఇదంతా బామ్మ నిర్ణయం అని ఫణి అంటాడు. బామ్మకి కాల్ చేస్తుంటే ఫణి ఆపుతాడు. నాకు ఈ కంపెనీకి సంబంధం ఈ చైర్‌తో కాదు అన్నయ్యతో కష్టపడే వాళ్లకి ఈ కుర్చీ అవసరం లేదని అన్నయ్య కోసం ఆ ఛైర్‌లో కూర్చొని నా పని చేస్తానని అంటాడు. బామ్మ కోపం మీ కోపం తగ్గించి తప్పు నిరూపించిన తర్వాతే ఈ కుర్చీలో కూర్చొంటా అంటాడు.
బాల, త్రిపురలు కొబ్బరి బొండాం తాగడానికి వెళ్తారు. ఇంతలో ఎదురుగా బొమ్మల షాప్‌లో బాల లేడీ డిటెక్టివ్ బొమ్మ చూస్తాడు. వెంటనే వెళ్తాడు. త్రిపుర కూడా వెనకాలే వెళ్తుంది. బాల ఆ బొమ్మ పట్టుకొని సుందరి నాకు ఓ ఐడియా వచ్చింది అని అంటాడు. ఏంటి అని త్రిపుర అంటే లాయర్‌తో నిజం చెప్పించే ఐడియా అని త్రిపురని తీసుకెళ్లి ఇద్దరూ డిటెక్టివ్‌ల్లా లాయర్ ఇంటికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!