గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. మేడమ్ టుస్సాడ్స్ లండన్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరించిన తొలి తెలుగు కథానాయకుడిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇవాళ రామ్ చరణ్ వాక్స్ స్టాట్యూ లాంచ్ చేశారు.
మైనపు విగ్రహంతో రామ్ చరణ్Ram Charan poses with his Wax Statue at Madame Tussauds London: రామ్ చరణ్ మైనపు విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. చరణ్, ఉపాసన దంపతులకు మూగజీవాలు అంటే ఎంతో ప్రేమ అనే సంగతి అందరికీ తెలిసిందే. పెట్ డాగ్ రైమ్‌ను తమతో పాటు విదేశాలకు సైతం తీసుకు వెళ్తారు. ఇప్పుడు చరణ్ మైనపు విగ్రహంతో ఆ రైమ్‌కు కూడా చోటు దక్కింది.
మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత రైమ్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు రామ్ చరణ్. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని మీరు చూడండి.
రామ్ చరణ్ సినిమాలకు వస్తే... ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'పెద్ది' సినిమా థియేటర్లు విడుదల కానుంది.
Also Read: కనిపించేది కాసేపే అయినా భారీ రెమ్యూనరేషన్... 'జైలర్ 2' కోసం బాలకృష్ణకు ఎన్ని కోట్లు ఆఫర్ చేశారంటే?