బాలీవుడ్ నటి కరీనాకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏం చేసినా అభిమానులకు ఆసక్తే. సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకున్న కరీనాకు ఇద్దరు ముద్దుల కొడుకులు జన్మించారు. అందులో మొదటి బాబు పేరు తైమూర్ కాగా, రెండో బాబు పేరు జహంగీర్. పిల్లల పేర్ల విషయం కరీనా కుటుంబం విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. ఆ ట్రోలింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ పోర్టల్ తో మాట్లాడుతూ స్పందించింది కరీనా. 


కరీనా మాట్లాడుతూ ‘నిజాయితీగా చెబుతున్నా ఆ పేర్లు మాకు బాగా నచ్చాయి.  అంతకన్నా ఇంకేం లేదు.  అందమైన పిల్లలకు, అవి చక్కటి పేర్లు. అయినా నా కర్ధం కాదు,  చిన్న పిల్లలను కూడా ఎందుకు ట్రోల్ చేస్తారు. ఆ విషయం నాకు చాలా భయంకరంగా అనిపిస్తోంది. నేను ఆ పరిస్థితిని అధిగమించాలి, దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే నా జీవితాన్ని ట్రోలింగ్స్ లో చూడలేను’ అని మనసులో బాధను బయటపెట్టింది. 


కరీనా పెద్ద కొడుకు తైమూర్ 2017లో జన్మించాడు. చరిత్రలో తైమూర్ పేరుతో ఓ మంగోల్-టర్కిష్ చక్రవర్తి ఉన్నాడు. ఇతను 1398లో ఢిల్లీపై దాడికి దిగాడు. మనదేశంపై దాడి చేసిన వ్యక్తి పేరును పెడతారా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. రెండో బాబు 2021 ఫిబ్రవరిలో జన్మించాడు. అతడికి జహంగీర్ అని పేరు పెట్టారు. నాలుగో మొఘల్ చక్రవర్తి పేరు జహంగీర్. అతను దాదాపు 22 ఏళ్లు మొఘల్ రాజ్యాన్ని పాలించాడు. ఈ పేరును కూడా నెటిజన్లు ట్రోల్ చేశారు. దీనిపై కరీనా మాత్రమే కాదు సైఫ్ కూడా స్పందించాడు. తాను అలాంటి ట్రోల్స్ చదవకుండా ఉండటానికే ప్రయత్నిస్తానని, అందుకోసం వేరే విషయాలపై దృష్టి మళ్లిస్తానని తెలిపాడు. 


రెండో  ప్రసవం తరువాత కరీనా మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్దమైంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోనా నటిస్తున్న ‘లాల్ సింగ్ ఛద్దా’ నటిస్తోంది. ఆమె 2000లో రెఫ్యూజీ సినిమాతో సినిమాల్లో అడుగుపెట్టింది. ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ మనవరాలు. కరీనా తల్లి బబిత గర్భం దాల్చినప్పుడు కరెనిని అనే పుస్తకం చదివారు. ఆ పుస్తకం పేరునే  మార్చి కరీనా అని నామకరణం చేశారు. 


Also read:చిరు ఇంట్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
Also read: ఆమె చదివింది ఎమ్మెస్సీ... చేసేది రోడ్లు ఊడ్చేపని
Also read: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...