'18 పేజెస్' లో అనుపమ లుక్.. 


'కుమారి 21 ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా రూపొందుతోన్న సినిమా '18 పేజెస్'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న అనుపమ పాత్ర నందినిని పరిచయం చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా నందిని పాత్రను పరిచయం చేస్తూ ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. పచ్చని చెట్ల మధ్య ఓ సీతాకోక చిలుల ఎగురుతూ రావడం ఈ పోస్టర్ లో మనకి కనిపిస్తుంది. ఆ తరువాత అది ఎగురుతూ వెళ్లి నందిని అదే మన అనుపమ మీద వాలుతుంది. ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు.







బేబమ్మతో నితిన్ రొమాన్స్.. 


యంగ్ హీరో నితిన్ ఒకదాని తరువాత మరొక సినిమా చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం 'మ్యాస్ట్రో' సినిమా పనుల్లో బిజీగా ఉన్న నితిన్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాడు. పూరి జగన్నాథ్ దగ్గర పని చేసిన  ఎస్‌ఆర్‌ శేఖర్‌ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఇందులో నితిన్‌కు జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం ఉదయం నగరంలో జరిగింది. ఈ వేడుకకు చిత్రబృందంలోని సభ్యులతోపాటు నిర్మాత అల్లు అరవింద్‌, వెంకీ కుడుముల, అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు నితిన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.